మళ్లీ వైసీపీలోకి భూమా అఖిలప్రియ... ఆమె ద్వారా ప్రయత్నాలు... జగన్ ఓకే చెబుతారా ?

భూమా అఖిలప్రియ మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇందుకోసం సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సంప్రదించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: June 11, 2019, 8:56 PM IST
మళ్లీ వైసీపీలోకి భూమా అఖిలప్రియ... ఆమె ద్వారా ప్రయత్నాలు... జగన్ ఓకే చెబుతారా ?
భూమా అఖిలప్రియ (file)
  • Share this:
గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ... తండ్రి భూమా నాగిరెడ్డి మరణం తరువాత మంత్రి అయ్యారు. అప్పటి నుంచి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ వచ్చిన అఖిలప్రియ... టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని నంద్యాలలో గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో అటు ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసిన అఖిలప్రియ, ఇటు నంద్యాల నుంచి పోటీ చేసిన బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఓటమి చెందారు. దీంతో భూమా అఖిలప్రియ మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జిల్లా రాజకీయవర్గాల్లో సాగుతోంది. ఇందుకోసం సీఎం జగన్ తల్లి, వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను సంప్రదించేందుకు భూమా అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

గతంలో వైఎస్ జగన్, భూమా కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉండటంతో... ఆ దిశగా భూమా అఖిలప్రియ ప్రయత్నాలు మొదలుపెట్టారనే వార్తలు జోరందుకున్నాయి. అయితే గతంలో తమను రాజకీయంగా మోసం చేసిన భూమా ఫ్యామిలీని వైఎస్ జగన్ మళ్లీ ఆదరిస్తారా... అసలు ఇందుకు విజయమ్మ అఖిలప్రియకు సహకరిస్తారా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే అఖిలప్రియ పార్టీ మారాలని భావించినా... ఆళ్లగడ్డ రాజకీయాలు అందుకు అనుకూలంగా ఉండబోవనే టాక్ కూడా ఉంది. మొత్తానికి వైసీపీ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన భూమా అఖిలప్రియ మళ్లీ ఆ పార్టీలోకి వస్తారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.






First published: June 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...