సీజనల్ వ్యాధులపై విస్తృత ప్రచారం... మంత్రి కేటీఆర్

సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు అధికారులు ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పించాలని కేటీఆర్ ఆదేశించారు. ప్రజలు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

news18-telugu
Updated: September 9, 2019, 6:18 PM IST
సీజనల్ వ్యాధులపై విస్తృత ప్రచారం... మంత్రి కేటీఆర్
కేటీఆర్(ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: September 9, 2019, 6:18 PM IST
నగరంలో ప్రబలుతున్న సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ లోకేశ్ కుమార్‌తో పాటు ఉన్నతాధికారులు, కార్పొరేటర్లు రేపటి నుంచి ప్రజల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తామని ఆయన అన్నారు. తాను కూడా ఇందులో భాగస్వామ్యం అవుతానని అన్నారు. నగరంలో చెత్త వేసే వెయ్యి ప్రాంతాలను గుర్తించామని... వాటిని యుద్ధప్రాతిపదికన తొలగిస్తామని అన్నారు. ఇళ్లలో నీరు నిల్వ లేకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని వివరించారు.

ఇకపై సీజనల్ వ్యాధులపై ప్రత్యేకమైన క్యాలెండర్ రూపొందించి వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాలేజీలు, స్కూళ్లతో పాటు ఇళ్లల్లోనూ దీనిపై ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తామని అన్నారు. ప్రజల సహకారం ఉంటేనే ఈ వ్యాధులు అరికట్టడం సాధ్యమవుతుందని కేటీఆర్ అన్నారు. రాబోయే 15 రోజుల్లో డెంగ్యూను పూర్తిగా అదుపులోకి తీసుకొస్తామని వెల్లడించారు. మీడియా, విపక్షాలు లేనిపోయి భయాందోళనలు సృష్టించడం సరికాదని కేటీఆర్ అన్నారు. రోడ్లను బాగు చేసేందుకు కొత్త తరహా నిర్ణయం తీసుకోబోతున్నామని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను సక్రమంగా డంపింగ్ చేయని వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.


First published: September 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...