దివాకర్ ట్రావెల్స్‌కు బ్రేక్.. జేసీ సంచలన నిర్ణయం

రోజూ కేసుల గొడవే ఎందుకన్న ఉద్దేశంతోనే ట్రావెల్స్ బిజినెస్‌ను కొంతకాలం పాటు మానేస్తున్నట్లు తెలిపారు. అందుకే దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఇంట్లోనే పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు జేసీ.

news18-telugu
Updated: November 15, 2019, 4:29 PM IST
దివాకర్ ట్రావెల్స్‌కు బ్రేక్.. జేసీ సంచలన నిర్ణయం
జేసీ దివాకర్ రెడ్డి
  • Share this:
అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రావెల్స్‌ బిజినెస్‌ను కొంత సమయం పాటు ఆపేసే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. దివాకర్ ట్రావెల్స్ బస్సులు, లారీలను టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు జేసీ. రోజూ కేసుల గొడవే ఎందుకన్న ఉద్దేశంతోనే ట్రావెల్స్ బిజినెస్‌ను కొంతకాలం పాటు మానేస్తున్నట్లు తెలిపారు. అందుకే దివాకర్ ట్రావెల్స్ బస్సులను ఇంట్లోనే పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు జేసీ. అలాగని బిజినెస్ పూర్తిగా మానేయడం లేదని.. ఇది తాత్కాలికం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. సీఎం జగన్‌లో ప్రతీకార వాంఛ పెరిగిపోయిందని మండిపడ్డారు. ప్రత్యర్థులను హింసించే క్రమంలో.. ఈ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు మాజీ ఎంపీ.

దివాకర్ ట్రావెల్స్‌తో పాటు ఇతర ఆస్తుల విషయంలో తనపై ఒత్తిళ్లు తెస్తున్నారని మాజీ ఎంపీ ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు అధికారులపై కేసులు వేశానని.. ఐతే పైవాళ్ల ఒత్తిడితోనే ఇలా చేస్తున్నామని వారంతా కాళ్ల బేరానికి వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇక ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే.. జగన్ ఇప్పటికీ తమవాడేనంటూ వ్యాఖ్యానించారు జేసీ. ఎక్కడైనా కనిపిస్తే కలిసి మాట్లాడతానని చెప్పుకొచ్చారు. టీడీపీలో ఉంటే ఉపయోగం లేదనే భావనలోనే నేతలు బయటకు వెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. పార్టీని వీడే నేతలు.. ఏదో ఒకటి విమర్శించాలన్న ఉద్దేశంతోనే టీడీపీపై బురద జల్లుతున్నారని అన్నారు.

First published: November 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...