రెండు చోట్లా ఓడినా.. నా మాట ఒక్కటే.. పవన్ కళ్యాణ్ రియాక్షన్

పవన్ కళ్యాణ్,

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండుచోట్ల ఓడిపోయారు. గాజువాక, భీమవరంలో రెండు చోట్లా పరాజయం చెందారు.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. విజయవాడలో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. తాను రెండుచోట్ల ఓడిపోయినా, జనసేన పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోయినా తాను మాత్రం ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. ‘పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ, విదేశాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు వేసిన వారికి, ఓటు వేయించిన వారికి ధన్యవాదాలు. మెజారిటీ సాధించిన వైసీపీకి, సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు. ప్రధాని మోదీకి శుభాకాంక్షలు. ఏ ప్రత్యేక హోదా అయితే వస్తుందని అంతా భావించారో.. ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. జనసేన ఈ ఎన్నికల్లో కొత్తరకం రాజకీయాలు చేసింది. యువతకు సీట్లు ఇచ్చారు. ఎక్కడా డబ్బు, మద్యం పంచలేదు. నేను ఇచ్చిన మాట మీద నిలబడతా. రెండు స్థానాల్లో ఓడినా.. మా వాళ్లు ఒక్క సీటు గెలవకపోయినా.. నా కడశ్వాస వరకు రాజకీయాల్లో ఉంటా. ప్రజలకు అండగా ఉంటా.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.
    First published: