రంగంలోకి సోనియా గాంధీ... జగన్, కేసీఆర్... కాంగ్రెస్‌తో కలుస్తారా ?

ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23 నాడే ప్రాంతీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఢిల్లీలో జరగబోయే ఈ భేటీకి రావాలని పలు పార్టీలను ఆహ్వానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సోనియాగాంధీ ఆహ్వానించిన పార్టీల జాబితాలో టీడీపీతో పాటు టీఆర్ఎస్, వైసీపీ కూడా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 15, 2019, 12:07 PM IST
రంగంలోకి సోనియా గాంధీ... జగన్, కేసీఆర్... కాంగ్రెస్‌తో కలుస్తారా ?
వైెఎస్ జగన్, సోనియాగాంధీ, కేసీఆర్
  • Share this:
ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఇందుకోసం వ్యూహరచన మొదలుపెట్టింది. బీజేపీకి ఈసారి కచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ వచ్చే అవకాశం లేదని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్... ఆ పార్టీకి వ్యతిరేకంగా, తటస్థంగా ఉన్న పార్టీలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఇందుకోసం స్వయంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ రంగంలోకి దిగారని తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడనున్న మే 23 నాడే ప్రాంతీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ... ఢిల్లీలో జరగబోయే ఈ భేటీకి రావాలని పలు పార్టీలను ఆహ్వానించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

సోనియాగాంధీ ఆహ్వానించిన పార్టీల జాబితాలో టీడీపీతో పాటు టీఆర్ఎస్, వైసీపీ కూడా ఉన్నట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు స్వయంగా సోనియా గాంధీ రంగంలోకి దిగడంతో... టీఆర్ఎస్, వైసీపీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తాయా అనే అంశంపై చర్చ మొదలైంది. సోనియాగాంధీ కేసీఆర్‌తో స్వయంగా చర్చలు జరిపితే... టీఆర్ఎస్ కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ విషయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వైఖరి తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్‌, సోనియాగాంధీతో విభేదించిన కారణంగానే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని... కాబట్టి అలాంటి కాంగ్రెస్‌తో జగన్ కలిసి పనిచేసే అవకాశం లేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే తాను కాంగ్రెస్‌ను క్షమించానని కొద్ది రోజుల క్రితం జగన్ చేసిన వ్యాఖ్యలను కొందరు గుర్తు చేస్తున్నారు. దీన్ని బట్టి ఆయన కాంగ్రెస్‌కు మద్దతిచ్చే ఛాన్స్ కూడా ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీలకు సమాన దూరం పాటిస్తున్న టీఆర్ఎస్, వైసీపీ సోనియాగాంధీ ఏర్పాటు చేసే సమావేశానికి వెళతాయా అన్నది ఆసక్తికరంగా మారింది.
First published: May 15, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading