కొత్త సచివాలయంతో ఏటా రూ. 32 కోట్లు మిగులుతుందన్న టీఆర్ఎస్ నేత

కొత్త సచివాలయం నిర్మాణం కారణంగా ప్రభుత్వ ధనం దుబారా అవుతుందన్న వాదనను టీఆర్ఎస్ కొట్టిపారేసింది.

news18-telugu
Updated: July 16, 2019, 3:09 PM IST
కొత్త సచివాలయంతో ఏటా రూ. 32 కోట్లు మిగులుతుందన్న టీఆర్ఎస్ నేత
కొత్త సచివాలయం నమూనా (File)
  • Share this:
తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని విపక్ష నేతలు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సచివాలయం నిర్మాణం కారణంగా ప్రభుత్వ ధనం దుబారా అవుతుందన్న వాదనను టీఆర్ఎస్ కొట్టిపారేసింది. వేర్వేరు చోట్ల ఉన్న కార్యాలయాల కోసం ప్రభుత్వం ప్రతి యేటా రూ. 32 కోట్లను అద్దె రూపంలో చెల్లిస్తోందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. అలా పదేళ్ల పాటు చెల్లించే అద్దెతో సచివాలయాన్ని కడుతుంటే ప్రభుత్వానికి ఆదా తప్ప దుబారా ఖర్చు ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరు నుంచి దృష్టి మళ్లించడానికే ప్రతిపక్షాలు వివాదం సృష్టిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇప్పుడున్న సచివాలయం గబ్బిలాల కొంపగా మారిందని కర్నె ప్రభాకర్ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ, సచివాలయం కొత్త నిర్మాణాలను అడ్డుకోవాలని గవర్నర్‌ను ప్రతిపక్షాలు కోరడం దుర్మార్గమన్నారు. ఢిల్లీలో కొట్లాడుకునే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం మిత్రపక్షాలుగా మారాయని, ఇదేమి సిద్ధాంతమో ఆ రెండు పార్టీలు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


First published: July 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...