రోజా వర్సెస్ భూమన... మంత్రి పదవి దక్కేదెవరికి ?

చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పదవి విషయంలో రోజాకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్‌లో చోటు ఖాయం కావడంతో... రెండో మంత్రి పదవి రోజా లేదా భూమనల్లో ఒకరికి దక్కుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

news18-telugu
Updated: June 7, 2019, 7:04 AM IST
రోజా వర్సెస్ భూమన... మంత్రి పదవి దక్కేదెవరికి ?
రోజా (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: June 7, 2019, 7:04 AM IST
ఏపీ మంత్రివర్గ విస్తరణకు ఇంకా ఒక రోజు సమయం మాత్రమే ఉంది. దీంతో అవావాహుల్లో టెన్షన్ అంతకంతకూ పెరిగిపోతోంది. కేబినెట్‌లో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై వైసీపీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మిగతా నేతల సంగతి ఎలా ఉన్నా... వైసీపీలో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించే రోజాకు మంత్రి పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. జూన్ 8న మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు సిద్ధమైన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన కేబినెట్‌లో ఎవరికి చోటు కల్పించాలనే విషయాన్ని చాలా రోజుల క్రితమే నిర్ణయించుకున్నారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ జాబితాలో రోజా ఉన్నారా లేదా అన్నదే చాలామంది వేధిస్తున్న ప్రశ్న.

నిజానికి చిత్తూరు జిల్లా నుంచి రోజాకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేబినెట్‌లో చోటు ఖాయం కావడంతో... రెండో మంత్రి పదవి రోజా లేదా భూమనల్లో ఒకరికి దక్కుతుందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకవేళ భూమనకు టీటీడీ చైర్మన్ పోస్టు దక్కి ఉంటే రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అయితే టీటీడీ చైర్మన్ పదవి పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డికి దక్కడంతో... భూమనకు మంత్రి పదవి దక్కే అవకాశాలు బాగానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని వ్యాఖ్యానించిన భూమనకు స్పీకర్ పదవి దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. అదే జరిగితే రోజా మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చిత్తూరు జిల్లా వైసీపీలో కీలక నేతలుగా... ఆ పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్న రోజా, భూమనల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.First published: June 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...