అమరావతిలో ఇష్టంలేని వారి భూములు వెనక్కిచ్చేస్తామన్న మంత్రి

‘అమరావతి కోసం ఎవరైనా ఇష్టం లేకుండా భూమి ఇచ్చిన వాళ్ళు అడిగితే.. వాళ్ళ భూమి వాళ్లకు తిరిగిస్తాం.’ అని బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

news18-telugu
Updated: June 26, 2019, 11:05 PM IST
అమరావతిలో ఇష్టంలేని వారి భూములు వెనక్కిచ్చేస్తామన్న మంత్రి
బొత్స సత్యనారాయణ (File)
  • Share this:
అమరావతిలో గత ప్రభుత్వ హయాంలో రైతులు మనస్పూర్తిగా కాకుండా ఇష్టం లేకుండా ఎవరైనా భూములు ఇచ్చి ఉంటే, వారు కోరితే మళ్లీ వారి భూములు వారికి ఇచ్చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. మున్సిపల్ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ సీఆర్డీఏ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. సీఆర్డీఏ పరిధిలోని ప్రతి పనిలోనూ అవినీతి జరిగిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ‘రైతులకు ప్లాట్ల కేటాయింపు, పనుల కేటాయింపులో అక్రమాలు జరిగాయి. ప్లాట్ల కేటాయింపులో అనుయాయులకు ప్రాధాన్యం ఇచ్చారు. అక్రమాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించాం. రాజధాని అభివృద్ధిపై తర్వాత దృష్టి పెడతాం. గత ప్రభుత్వ అవినీతి పనులను కొనసాగించం. ఎవరైనా ఇష్టం లేకుండా భూమి ఇచ్చిన వాళ్ళు అడిగితే.. వాళ్ళ భూమి వాళ్లకు తిరిగిస్తాం.’ అని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. కరకట్ట అక్రమ కట్టడాల తొలగింపు ప్రజావేదికతో మొదలైందని చెప్పారు.

 

First published: June 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>