అందుకు మద్దతివ్వకపోతే టీడీపీకి రాజీనామా... కేశినేని నాని ప్రకటన...

సీఏఏకు వ్యతిరేకంగా ఏపీ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని, అందుకు టీడీపీ మద్దతివ్వకపోతే ఆ పార్టీకి తాను రాజీనామా చేస్తానని ఎంపీ కేశినేని నాని ప్రకటించారు.

news18-telugu
Updated: February 16, 2020, 10:13 PM IST
అందుకు మద్దతివ్వకపోతే టీడీపీకి రాజీనామా... కేశినేని నాని ప్రకటన...
విజయవాడ ఎంపీ కేశినేని నాని (ఫైల్ ఫోటో)
  • Share this:
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని, అందుకు టీడీపీ మద్దతివ్వకపోతే ఆ పార్టీకి తాను రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. కడపలో ఎంపీ కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ బిల్లులతో పేదలకు ఇబ్బందులు తప్పవని కేశినేని నాని అన్నారు. అవగాహన లేక సీఏఏ, ఎన్‌పీఆర్‌ బిల్లులకు మద్దతు తెలిపామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెబుతున్నారని, అలాంటి అవగాహన లేని వారికి పదవులు ఎందుకని ప్రశ్నించారు.

ఎన్ఆర్సీ మీద కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళితే తాను రాజీనామా చేస్తానని నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా సంచలన ప్రకటన చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిర్వహించిన భారీ ర్యాలీలో అంజద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన ప్రకటన చేశారు. ‘నాకు పదవులు ముఖ్యం కాదు. నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఎన్ఆర్సీ మీద కేంద్రం ముందుకు వెళితే రాజీనామాకు సిద్ధం. ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎం జగన్‌ను ఒప్పిస్తా.’ అని అంజద్ బాషా స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదని అంజద్ బాషా తేల్చి చెప్పారు.

ys jagan cabinet,ap cabinet,jagan cabinet,ys jagan cabinet ministers list,ap news,ap cabinet ministers,jagan cabinet ministers,ys jagan cabinet ministers,ap cm ys jagan,ys jagan cabinet list,ap cabinet expansion,jagan cabinet list,ap cabinet 2019,ys jagan news,ys jagan latest news,ap cabinet list,ys jagan cabinet ministers list 2019,ap cabinet list 2019,ap cm ys jagan cabinet,jagan cabinet ministers list,ap cabinet ministers 2019, వైఎస్ జగన్ కేబినెట్, జగన్ కేబినెట్ మంత్రుల ప్రమాణస్వీకారం, ఏపీ కేబినెట్ 2019,
అంజాద్ బాషా(కడప జిల్లా)


‘బీజేపీతో వైసీపీ జట్టుకట్టాల్సిన దౌర్భాగ్యం పట్టలేదు. మేం ఎన్డీయేలో చేరే ప్రసక్తే లేదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ద్రోహం చేసి బీజేపీతో కలవం. జగన్‌‌కు బీజేపీ రంగు పూయాలని 2011 నుంచి కుయుక్తులు పన్నుతున్నారు. సోషల్ మీడియాలో కల్పిత ప్రచారాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో జట్టుకట్టబోంది. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వారు ఈ రోజు ఆ పార్టీతోనే జట్టుకడుతున్నారు. వారంతా నిలకడలేని వారు. మాకు 151 సీట్లు ఉన్నాయి. ఆ దౌర్భాగ్యం మాకు లేదు.’ అని అంజద్ బాషా అన్నారు. వైసీపీ సెక్యులర్ పార్టీ అని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జగన్‌ను సీఎం చేశారని, వారి మనోభావాలు దృష్టిలో పెట్టుకుంటామని అంజద్ బాషా తెలిపారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: February 16, 2020, 10:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading