హోమ్ /వార్తలు /రాజకీయం /

‘చర్యకు ప్రతిచర్య’ బీజేపీకి బలమైన వార్నింగ్ ఇచ్చిన శతృఘ్న సిన్హా

‘చర్యకు ప్రతిచర్య’ బీజేపీకి బలమైన వార్నింగ్ ఇచ్చిన శతృఘ్న సిన్హా

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

శతృఘ్న సిన్హా(ఫైల్ ఫోటో)

ఈసందర్భంగా న్యూటన్ ఫార్ములాను ప్రస్తావించారు శతృఘ్న సిన్హా. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందన్నారు.

  బీజేపీ రెబల్ ఎంపీ శతృఘ్న సిన్హా మరోసారి ఆ పార్టీపై మండిపడ్డారు. పాట్నా లోక్‌సభ ఎంపీ అభ్యర్థిగా రవిశంకర్ ప్రసాద్‌ను బీజేపీ అధిష్టానం ప్రకటించిన కొన్నిగంటల్లోపే ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆరోపణలు చేస్తూ ట్విట్టర్‌లో ట్వీట్ల వర్షం కురిపించారు. ఈసందర్భంగా న్యూటన్ ఫార్ములాను ప్రస్తావించారు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందన్నారు. పార్టీ.. పార్టీ నాయకులు తనను ఎంతగానే ఇబ్బంది పెట్టినప్పటికీ వాటన్నింటిని కూడా భరించానన్నారు శతృఘ్న సిన్హా. బీజేపీకి గట్టి సమాధానం చెప్పేందుకు కావాల్సిన సామర్థ్యం తనకుందన్నారు. ఎల్.కె. అద్వానీని కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించిన అంశంపై కూడా శతృఘ్న సిన్హా మండిపడ్డారు. అద్వానికి జరిగిన అన్యాయంపై పట్ల కూడా తీవ్ర ఆరోపణలు చేశారు సిన్హా. పార్టీలో కురువృద్ధుడు, పార్టీకి దిశా నిర్దేశకుడు, ప్రముఖ సీనియర్ నేత అయిన అద్వానీకి కూడా అన్యాయం చేశారన్నారు.


  బీజేపీ ఈసారి గుజరాత్ గాంధీనగర్ నుంచి అద్వానిని కాకుండా అమిత్ షాను బరిలోకి దింపుతోంది. అద్వానీతో ఏమాత్రం సరిపోలిక లేనటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షుడుని పోటీకి దింపడం సరికాదన్నారు. ప్రజలే వాళ్లకు తగిన బుద్ధి చెబుతారన్నారు. 2014 ఎన్నికల్లో పాట్నాలో బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఎన్నికల్లో గెలుపొందారు. అయితే ఆయనకు కేబినెట్‌లో బెర్త్ దక్కలేదు. ఆ తర్వా త కాలంలో సిన్హా బీజేపీకి రెబల్‌గా మారారు.


  వీలు దొరికినప్పుడల్లా పార్టీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. మోడీ పాలనపై కూడా సిన్హా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆయనన నిష్ర్కమణ ఖాయమని అంతా భావించారు. అందరూ ఊహించినట్లుగానే శతృఘ్న సిన్హాకు టికెట్ ఇవ్వలేదు బీజేపీ. దీంతో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పట్నా సాహిబ్‌ నుంచే తిరిగి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు సిన్హా కాంగ్రెస్ టికెట్‌పై ఎన్నికల బరిలోకి దిగుతారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

  First published:

  Tags: Amit Shah, Bjp, Narendra modi, National News, Pm modi, Shatrughan Sinha

  ఉత్తమ కథలు