చిదంబరానికి జైలా ..బెయిలా ? తీహార్ జైల్లో సెల్ రెడీ

తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయన్నారు.

news18-telugu
Updated: August 26, 2019, 11:20 AM IST
చిదంబరానికి జైలా ..బెయిలా ? తీహార్ జైల్లో సెల్ రెడీ
చిదంబరం అరెస్ట్ పై న్యూస్‌18 క్రియేటివ్
news18-telugu
Updated: August 26, 2019, 11:20 AM IST
మాజీ కేంద్రమంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కాంలో అరెస్టైన చిదంబరం నాలుగు రోజులుగా సీబీఐ కస్టడీలో ఉన్నారు. ఢిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్ పిటిషన్ కొట్టివేయగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే ఆయన సీబీఐ కస్టడీ గడవు ఈ రోజు సాయంత్రంతో ముగియనుండడంతో చిదరంబానికి జెయిలా, బెయిలా అన్నదానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. చిదంబరాన్ని అరెస్టు చేసిన వెంటనే ఆయన లాయర్లు బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈనెల 23న ఈ పిటిషన్‌ విచారణకు రాగా కస్టడీ వ్యవహారంపై ఇప్పుడు జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

మరోవైపు బెయిల్ లభించకపోతే... చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తీహార్ జైల్లో కూడా ఇప్పటికే అందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా పూర్తిచేసినట్లు తెలుస్తోంది. తీహార్ జైలులో చిదంబరంకు సెల్ నెం. 7 ను కేటాయించబోతున్నారు. ఇందులో ఆర్ధిక నేరగాళ్లు ఉంటారు. మిగతా ఖైదీలకు ఉండే సదుపాయాలు మాత్రమే చిదంబరంకు ఉంటాయని .. పప్పు .. 4 చపాతీలు చిన్న బౌల్ లో ఇస్తామని తీహార్ జైలు అధికారులు చెబుతున్నారు. అతనికి సౌత్ ఇండియా ఫుడ్ కావాలంటే సెపరేట్ గా స్నాక్స్ అందుబాటులో ఉంచుతామని అది కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారమని చెబుతున్నారు. అలాగే జైల్లో చిదంబరంకు పరుపు లేకుండా ఉన్న మంచాన్ని ఇస్తామన్నారు. సీనియర్ సిటిజన్స్ కు మాత్రమే ఇటువంటివి ఏర్పాటు చేస్తారంట. మిగతా వారు అయితే కిందే పడుకోవాల్సిందేనని చెప్పారు. అయితే పరిస్థితి చూస్తుంటే చిదంబరంకు బెయిల్ వచ్చేది కష్టంగా మారింది.

First published: August 26, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...