WILL ORDER PROBE ON CORRUPTION IN TTD SAYS YV SUBBAREDDY MS
టీడీపీ హయాంలో టీటీడీలో అవకతవకలపై సమగ్ర విచారణ : వైవీ సుబ్బారెడ్డి
అర్చకులు ఆరోగ్యంగా ఉంటేనే స్వామి వారి కైంకర్యాలు జరుగుతాయని, అర్చకుల కోరిక మేరకు వారికి ప్రత్యేకంగా గదులు, భోజన సౌకర్యం ఏర్పాటు చేయాలని అధికారులని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రతీ సామాన్య భక్తుడికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నామని.. భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్తానం(టీటీడీ)లో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తెలుగుదేశం పాలనలో టీటీడీ నగదు,నగలు మాయమవడంపై సమగ్ర విచారణ జరిపిస్తామన్నారు. టీటీడీ నిధులను భక్తుల అవసరాలకు మాత్రమే ఉపయోగిస్తామని చెప్పారు.భక్తుల మనోభావాలను కాపాడేవిధంగా.. టీటీడీ ప్రతిష్టను పెంచేవిధంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. ఒంగోలులో టీటీడీ కళ్యాణ మండపం ఆధునికీకరణ పనులను పరిశీలించిన అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.
ప్రతీ సామాన్య భక్తుడికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోబోతున్నామని.. భక్తులకు మరింత మెరుగైన వసతులు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రిగా జగన్ గడిచిన 30 రోజుల పాలనను ప్రజలు గమనిస్తున్నారని.. పారదర్శక పాలనను వారు చూస్తున్నారని అన్నారు. గత పాలకులు కేవలం రాష్ట్రాన్ని దోచుకోవడానికే పరిమితమయ్యారని.. ఆ అవినీతిని వెలికితీసేందుకు సీఎం జగన్ ప్రత్యేక కమిటీలు వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ప్రతీ పేదవాడికి లబ్ది చేకూరాలన్నదే జగన్ ఆశయం అని.. నవరత్నాలను అందరికీ అందించే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.