Home /News /politics /

WILL ORDER FOR CBI ENQUIRY IF AP GOVT WONT TAKE ACTION AGAINST YSRCP MLAS WHO VIOLATED LOCKDOWN RULES SAYS HIGH COURT BA

కేసు సీబీఐకి అప్పగించాలా?... వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై హైకోర్టు ఆగ్రహం...

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

దీనిపై న్యాయస్థానం స్పందిస్తూ.. దీనిపై గతంలోనే రిట్ పిటిషన్ దాఖలైనందున పిల్ అవసరం లేదని తెలిపింది. పిల్ వేయడంలో రామకృష్ణారెడ్డి ఆసక్తి ఏంటని హైకోర్టు ప్రశ్నించింది.

వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది.

    ఆంధ్రప్రదేశ్‌లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము కేసును సీబీఐకి అప్పగించాల్సి ఉంటుందంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏపీలో పలువురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన కేసులో ఇప్పటి వరకు వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు చెప్పాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలను ఉల్లంఘించారంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూధన రెడ్డి, నగరి ఎమ్మెల్యే రోజా, పలమనేరు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్, చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని, సుళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్యల మీద గతంలో పిటిషన్ దాఖలైంది. తాజాగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటుగా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిలపైనా పిటిషన్లు దాఖలయ్యాయి. లాక్‌డౌన్ నిబంధనలు ప్రజాప్రతినిధులుగా అమలుచేయకపోవడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, లబ్ధిదారులతో ముఖాముఖిలో భాగంగా జరిగిందని ప్రభుత్వ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు సీబీఐ విచారణ ఎందుకు చేయకూడదని ప్రశ్నించింది.. అయితే, ప్రభుత్వం తరపు వివరాలు అందజేసేందుకు సమయం కోరారు ఏజీ. దీంతో పిటిషన్ విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, AP High Court, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు