• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WILL NOT GIVE MAHBUBNAGAR CHAIRMAN OR VICE CHAIRMAN POST TO AIMIM SAYS TELANGANA MINISTER SRINIVAS GOUD AK

ఎంఐఎంకు ఆ పదవి కూడా ఇవ్వబోమన్న తెలంగాణ మంత్రి

ఎంఐఎంకు ఆ పదవి కూడా ఇవ్వబోమన్న తెలంగాణ మంత్రి

శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ మంత్రి

ఎంఐఎంను బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.

  • Share this:
    మహబూబ్‌నగర్ మున్సిపల్ చైర్మన్ పదవిని ఎంఐఎం పార్టీకి ఇవ్వనున్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని తెలంగాణ మంత్రి, మహబూబ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఖండించారు. ఈ విషయంలో బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. ఎంఐఎంకు చైర్మన్ పదవి కాదు కదా కనీసం వైస్ చైర్మన్ పదవి కూడా ఇవ్వబోమని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఎంఐఎంను బూచిగా చూపించి ఓట్లు దండుకోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 24 గంటల్లో జాతీయ హోదా తీసుకురావాలని ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు సవాల్ విసిరారు. అలా చేస్తే చైర్మన్‌గా వాళ్లు ఎవరిని ఎంపిక చేస్తే వారిని పెడతామని అన్నారు. టీఆర్ఎస్ ఎంఐఎంతో పొత్తు పెట్టుకున్నట్టు ఎలా ఆరోపిస్తారని ఆయన బీజేపీని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీని టీఆర్ఎస్ గెలుచుకోవడం ఖాయమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు