మోదీ మళ్లీ కింగ్ అవుతారా ? ఎన్డీయేకు ఎన్ని సీట్లు ? సర్వేలు ఏం చెబుతున్నాయి ?

బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినంతగా మెజార్టీ రాకపోయినా... ఎన్డీయేకు మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వస్తాయని పలు సర్వేలు అంచనా తేల్చాయి.

news18-telugu
Updated: April 9, 2019, 4:57 PM IST
మోదీ మళ్లీ కింగ్ అవుతారా ? ఎన్డీయేకు ఎన్ని సీట్లు ? సర్వేలు ఏం చెబుతున్నాయి ?
ప్రధాని నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
తొలి విడత ఎన్నికల ప్రచారానికి మరికాసేపట్లో తెరపడనుంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో మళ్లీ అధికారం ఎవరికి దక్కనుందనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరోసారి నరేంద్రమోదీ దేశానికి ప్రధాని అవుతారా ? సరికొత్త పథకాలు కాంగ్రెస్‌కు అధికారాన్ని తెచ్చిపెడతాయా అనే అంశంపై ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. మరోవైపు బీజేపీకి గత ఎన్నికల్లో వచ్చినంతగా మెజార్టీ రాకపోయినా... ఎన్డీయేకు మాత్రం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు వస్తాయని పలు సర్వేలు తేల్చాయి. అనేక సర్వే సంస్థలు వెలువరించిన అంచనాలను యావరేజ్ చేయగా... మోదీ సారథ్యంలోని ఎన్డీయేకు 273 సీట్ల సింపుల్ మెజార్టీ రానుందని తేలింది.

ఇప్పటివరకు వెలువడిన సర్వే ఫలితాలను ఓ సారి పరిశీలిస్తే... ఎన్డీయేకు సీ ఓటర్ సర్వే 267 సీట్లు, ఇండియా టీవీ సీఎన్ఎక్స్ సర్వే 275 సీట్లు, సీఎస్‌డీఎస్ లోక్‌నీతి సర్వే 273 సీట్లు, టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే 279 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ మొత్తం సర్వేల్లోని లెక్కలు సరాసరిగా తీసుకుంటే ఎన్డీయేకు 273 సీట్లు రానున్నాయి. ఇక ఈ సర్వేల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు సరాసరిగా 141 సీట్లు వస్తాయని తేలింది. ఇక ఈ రెండు కూటములకు దూరంగా ఉన్న ఇతర పార్టీలకు సరాసరిగా 129 సీట్లు రానున్నాయి.

First published: April 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...