ఒకే వేదికపై కేసీఆర్, యోగి.. ఇద్దరు సీఎంలు కలవబోతున్నారా?

ఒకరిది ఉత్తర ధృవం, మరొకరిది దక్షిణ దృవం. అలాంటి ఇద్దరు నేతలు ఒకే వేదికపై కలవడం సాధ్యమేనా? ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒకే వేదికను పంచుకుంటారా? ఆ ఘట్టం ఆవిష్కృతమయ్యే సూచనలైతే కనిపిస్తున్నాయి.

news18-telugu
Updated: February 11, 2019, 10:01 PM IST
ఒకే వేదికపై కేసీఆర్, యోగి.. ఇద్దరు సీఎంలు కలవబోతున్నారా?
యోగి, కేసీఆర్
news18-telugu
Updated: February 11, 2019, 10:01 PM IST
పాలనలో ఇద్దరి పంథా వేరే అయినా... ఆధ్యాత్మికత భావాల్లో మాత్రం కేసీఆర్, యోగి ఆదిత్యనాథ్‌లకు సారూప్యత ఉంది. దైవకార్యాల్లో పాల్గొనేందుకు ఈ ఇద్దరు ముఖ్యమంత్రులూ ముందుంటారు. ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఆధ్యాత్మికంగా తాము చేయదలుచుకున్నది చేస్తూ ముందుకు సాగుతారు. కానీ, ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా ప్రత్యర్థులు. అలాంటి, ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే ఘట్టం ఆవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. విశాఖ శారదాపీఠంలో ఆదివారం నుంచి అష్టబంధన మహా కుంభాభిషేకం ప్రారంభమైంది. ఈనెల 14న మహాపూర్ణాహుతి కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీ తెలిపారు.

గత డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ శారదా పీఠాన్ని సందర్శించారు. అక్కడి రాజశ్యామల మాతను దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆ సమయంలోనే ఆశ్రమంలో తలపెట్టిన మహాకుంభాభిషేకానికి రావాలని సీఎం కేసీఆర్‌ను స్వామీజీ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఈనెల 14న ముఖ్యమంత్రి కేసీఆర్ శారదాపీఠానికి వెళ్లే అవకాశం ఉంది. ఈనేపథ్యంలోనే యోగి, కేసీఆర్‌లు కలుసుకునే అవకాశం లేకపోలేదనే టాక్ వినబడుతోంది. అయితే కేసీఆర్,యోగి ఆదిత్యనాథ్‌లు ఒకేసారి ఆశ్రమానికి వస్తారా.. లేక ఎవరికివారు విడివిడిగా వచ్చి వెళ్తారా అనేది చూడాలి.

ఇక అదే రోజున అమరావతిలో వైఎస్ జగన్ గృహప్రవేశం ఉన్న నేపథ్యంలో.. కేసీఆర్ శారదా పీఠం నుంచి నేరుగా అక్కడికే వెళ్లే అవకాశం ఉంది. జగన్‌ను కలిసి ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి కేసీఆర్ పర్యటన ఎలా సాగుతుంది? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

 

First published: February 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...