చేవెళ్ల చెల్లెమ్మకు దక్కేదేంటి ... కేసీఆర్ ఏ పదవి ఇవ్వనున్నారు ?

చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు తెచ్చుకున్న మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డికి కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్‌ను కలిసిన సందర్బంగా సబితా.... తనకు మంత్రి పదవితో పాటు.. కుమారుడికి ఎంపీ టికెట్ కూడా కావాలని కేసీఆర్‌ని కోరినట్లు సమాచారం.

Sulthana Begum Shaik | news18-telugu
Updated: March 14, 2019, 2:15 PM IST
చేవెళ్ల చెల్లెమ్మకు దక్కేదేంటి ... కేసీఆర్ ఏ పదవి ఇవ్వనున్నారు ?
సబితా ఇంద్రారెడ్డి, కేసీఆర్(File)
  • Share this:
కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌ను వీడి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లోకి వెళ్లడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో సబిత కుటుంబానికి టీఆర్ఎస్‌లో గులాబీ బాస్ ఎలాంటి పదవులు కల్పిస్తారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. సబితకు మంత్రి పదవి ఇస్తారా లేకుండా ఆమె కుమారుడు కార్తీక రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తారా అనే అంశంపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే చేవెళ్ల చెల్లెమ్మకు  పదవులకు సంబంధించి కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభించలేదనే టాక్ వినిపిస్తోంది. కేసీఆర్‌ను కలిసిన సందర్బంగా సబితా.... తనకు మంత్రి పదవితో పాటు.. కుమారుడికి ఎంపీ టికెట్ కూడా కావాలని కేసీఆర్‌ని కోరినట్లు సమాచారం.

అయితే కేసీఆర్ మాత్రం ఈ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుమారుడికి ఎంపీ సీటు ఇస్తే.. సబితకు మంత్రి పదవి లేనట్లే అనే టాక్ వినిపిస్తోంది.  ఒకవేళ సబితాకు మంత్రి పదవి కేటాయిస్తే.. ఇక కుమారుడు కార్తీక్ రెడ్డికి ఎంపీ సీటు రానట్లే అని చెప్పాలి.  టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎంపీ విశ్వేశ్వరరావు చేవెళ్ల నుంచి బరిలోకి దిగనున్నారు.  మరోవైపు చేవెళ్లలో సబిత కుటుంబానికి ఆదరణ ఉంది. దీంతో అక్కడ బలమైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిని అధికార పార్టీ బరిలోకి దింపుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

చేవెళ్ల చెల్లెమ్మగా గుర్తింపు పొందిన సబిత.... కాంగ్రెస్ హయాంలో హోంశాఖతో పాటు పలు కీలక శాఖలకు మంత్రులగా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే ఓ రాష్ట్రానికి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2014లో కుమారుడి ఎంపీ సీటు కోసం  అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న సబిత... గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో తన కుమారుడికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై ఆమె అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా కాంగ్రెస్ తరపున చేవేళ్ల ఎంపీ సీటు సైతం కార్తీక్ రెడ్డికి దక్కే సూచనలు లేకపోవడంతో... పార్టీ మారేందుకు సబితా ఇంద్రారెడ్డి సిద్ధమయ్యారు.

First published: March 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading