• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WILL JANASENA CHIEF PAWAN KAYAN ENDS ALLIANCE WITH BJP IN ANDHRA PRADESH AFTER LOCAL BODY ELECTIONS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN BK

Andhra Pradesh: ఏపీలో బీజేపీకి షాక్ ఇవ్వ‌నున్న ప‌వ‌న్...? బంధానికి ముగింపు పలుకుతారా..?

Andhra Pradesh: ఏపీలో బీజేపీకి షాక్ ఇవ్వ‌నున్న ప‌వ‌న్...?  బంధానికి ముగింపు పలుకుతారా..?

పవన్ కల్యాణ్ తో సోము వీర్రాజు (ఫైల్)

Andhra Pradesh: గెలుస్తాం అనుకున్న చోట కూడా జ‌న‌సేన పార్టీ ఓడిపోవ‌డానికి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు పార్టీ శ్రేణులు వ్య‌క్తం చేస్తోన్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో మున్సిప‌ల్, పంచాయితీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌రువాత ఏపీలో రాజ‌కీయ ప‌రిణామాలు జోరుగా మారుతున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీ బ‌లమేంతో క్షేత్ర‌స్థాయిలో తెలిసిపోయిన త‌రువాత త‌మ రాజ‌కీయ విధానాల‌ను, వ్యూహాల‌ను మార్చుకుంటున్నాయి పార్టీలు. ఇప్ప‌టి వ‌ర‌కు దోస్త్ మేరా దోస్త్ అంటూ తిరిగిన పార్టీలు బ్రేక‌ప్ చెప్ప‌డానికి రెడీ అవుతున్నాయ‌ని స‌మాచారం. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్ర బీజేపీకి ఝల‌క్ ఇచ్చిన జ‌న‌సేన ఇప్పుడు ఏపీలో కూడా ఆ పార్టీకితో పొత్తు తెగ‌తెంపులు చేసుకోవాడానికి రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. పంచాయితీ, మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసే పోటీ చేసిన‌ప్ప‌టికి పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. అయితే బీజేపీతో పోల్చుకుంటే చాలా పంచాయితీల్లో, కార్పొరేష‌న్లలో కాస్త మెరుగైన ఫ‌లితాల‌నే సాధించింది. అయితే ఇంకా గెలుస్తాం అనుకున్న చోట కూడా జ‌న‌సేన పార్టీ ఓడిపోవ‌డానికి మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కార‌ణ‌మ‌నే అభిప్రాయాలు పార్టీ శ్రేణులు వ్య‌క్తం చేస్తోన్నాయి.

    కార్పొరేష‌న్లలో బీజేపీకి ఒకటి, జ‌న‌సేన‌కు 7 స్థానాలు ద‌క్కాయి. మున్సిపాలిటిల్లో జ‌న‌సేన‌కు 18 బీజేపీకి 7 వార్డులు ద‌క్కాయి. అయితే ఫ‌లితాలు మిత్ర పార్టీ బీజేపీతో పోల్చుకుంటే ప‌ర్వాలేదు అనిపించినా పార్టీ ఖ‌చ్చితంగా గెలుస్తాం అనుకున్న బెజ‌వాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ తో పాటు, తూర్పు గోదావరి, ప‌శ్చిమ గోదావ‌రి స్థానాల్లో జ‌న‌సేన ఖ‌చ్చితంగా గెలుస్తాం అనుకున్న చోట ఆపార్టీ బోల్తా ప‌డింది. దీంతో ఈ ఓట‌మికి కార‌ణం త‌మ మిత్ర‌ప‌క్షం బిజేపీనే అనే అభిప్రాయం పార్టీలో ప‌లువురు సీనియ‌ర్ నేత‌లు కూడా వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది. ఇదే అభిప్రాయం అధినేత ప‌వన్ వ‌ద్ద కూడా వ్య‌క్తప‌రిచిన‌ట్లు పార్టీ వ‌ర్గాల స‌మాచారం. ఇక్క‌డ‌తో ఆగ‌కుండా పార్టీ శ్రేణులు త‌మ ఓట‌మికి బిజేపీతో పొత్తే కార‌ణ‌మ‌ని బ‌హిరంగానే వ్యాఖ్య‌లు చేస్తోన్నారు.

    ఇది చదవండి: విజయవాడ మేయర్ గా భాగ్యలక్ష్మి... ఆ మూడు పదవులు మహిళలకే


     జ‌న‌సేన అధికార ప్ర‌తినిధి పోతిన మ‌హేష్ త‌మ పార్టీ అనుకున్న స్థానాల్లో ఓట‌డిపోవ‌డానికి బీజేపీతో ఉన్న పోత్తే కార‌ణ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే ప‌వ‌న్ అనుమ‌తి లేకుండా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయారు కాబ‌ట్టి ఇది ఖ‌చ్చితంగా ఆ పార్టీతో బ్రేక‌ప్ చెప్ప‌డానికి గ్రౌండ్ ప్రీపేర్ చేసుకోవ‌డ‌మే అంటున్నారు రాజ‌కీయ ప‌రిశీల‌కులు. ఇదిలా ఉంటే మ‌హేష్ చేసిన వ్యాఖ్య‌ల‌పై పార్టీ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి ప్ర‌క‌ట‌న రాక‌పోవ‌డం కూడా ఇక్కడ గ‌మ‌నించాల్సిన అంశం అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇదిలా రాష్ట్రం ప‌ట్లు బీజేపీ వ్య‌హారిస్తోన్న తీరు కూడా ప‌వ‌న్ కు న‌చ్చ‌డం లేదు.

    విశాఖ స్టీల్ ప్లాట్ అంశం వ‌ల్లే అక్క‌డ పుంజుకోవాల్సిన జ‌న‌సేన పుంజుకోలేక‌పోయింద‌ని అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతోపాటు తిరుప‌తి ఉపఎన్నిక‌కు సంబంధి బీజేపీ వ్య‌వ‌హారించి తీరుపై కూడా జ‌న‌సైన‌కులు గ‌రంగ‌రంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో త్య‌ర‌లో జ‌న‌సేన బీజేపీ పొత్తుకు గుడ్ బై చెప్ప‌బోతుంద‌ని స్ప‌ష‌మైన స‌మాచారం ఆ పార్టీ నుంచే అందుతోంది.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు