మేం అధికారంలోకి వస్తే ఈసీని జైల్లో పెడుతాం : ప్రకాష్ అంబేడ్కర్ సంచలనం

Prakash Ambedkar Controversial Comments : బుధవారం నాందేడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రకాష్ అంబేడ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అధికారాన్ని కట్టబెడితే.. ప్రధాని మోదీ రద్దు చేసిన నోట్లను తిరిగి ప్రవేశపెడుతామని చెప్పారు.

news18-telugu
Updated: April 5, 2019, 7:34 AM IST
మేం అధికారంలోకి వస్తే ఈసీని జైల్లో పెడుతాం : ప్రకాష్ అంబేడ్కర్ సంచలనం
ప్రకాష్ అంబేడ్కర్ (File)
news18-telugu
Updated: April 5, 2019, 7:34 AM IST
అంబేడ్కర్ మనువడు, భరిపా బహుజన్ మహాసంఘ్ అధినేత ప్రకాష్ అంబేడ్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండు రోజులు జైల్లో పెడుతామని అన్నారు. పుల్వామా దాడిపై రాజకీయ పార్టీలను మాట్లాడనివ్వకుండా చేస్తున్న ఎన్నికల కమిషన్‌కు ఇలాంటి శిక్షనే విధించాలన్నారు. సోలాపూర్, అకోలా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి వంచిత్ బహుజన్ అగాది కూటమి తరుపున పోటీ చేస్తున్న ప్రకాష్ అంబేడ్కర్.. గురువారం ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పుల్వామా దాడిలో మనం 40మంది సైనికులను కోల్పోయినప్పటికీ.. ఇప్పటికీ మౌనంగానే ఉన్నాం. అంతేకాదు, దానిపై మాట్లాడవద్దని ఈసీ చెబుతోంది. మన వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకునే హక్కు ఈసీకి ఎక్కడిది. భారత రాజ్యాంగం మనకు మాట్లాడే హక్కును కల్పించింది. మేము బీజేపీలా కాదు.. మాకు అధికారాన్ని కట్టబెడితే.. ఎన్నికల కమిషన్‌ను రెండు రోజులు జైల్లో పెడుతాం-ప్రకాష్ అంబేడ్కర్

ఎన్నికలవేళ ఈసీపై ప్రకాష్ అంబేడ్కర్‌ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన ఈసీ.. స్థానిక అధికారులను దీనిపై నివేదిక కోరినట్టు వెల్లడించింది. మరోవైపు ప్రకాష్ అంబేడ్కర్ మాత్రం.. తాను మామూలుగానే ఆ వ్యాఖ్యలు చేశానని, కేవలం ఈసీ పైన చేసిన వ్యాఖ్యలే బయటకొచ్చాయని అన్నారు.బుధవారం నాందేడ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలోనూ ప్రకాష్ అంబేడ్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు అధికారాన్ని కట్టబెడితే.. ప్రధాని మోదీ రద్దు చేసిన నోట్లను తిరిగి ప్రవేశపెడుతామని చెప్పారు. కాగా, మహారాష్ట్రలో మొత్తం నాలుగు విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 11న మొదలయ్యే పోలింగ్.. ఏప్రిల్ 29న ముగియనుంది.First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...