Huzurabad: హుజూరాబాద్ కాంగ్రెస్ ప్లాన్.. లీక్ చేసిన హరీశ్ రావు.. అభ్యర్థి ఆయనేనా ?

రేవంత్ రెడ్డి, హరీశ్ రావు(ఫైల్ ఫోటో)

Huzurabad: కేసీఆర్ దళితబంధు పథకాన్ని తట్టుకుని నిలబడాలంటే.. హుజూరాబాద్‌లో దళిత నాయకుడికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం.

  • Share this:
    ఇప్పుడు తెలంగాణలో అందరి దృష్టి హుజూరాబాద్ ఉప ఎన్నిక మీదే ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక తమ అభ్యర్థిని ఎంపిక చేసే పనిలో టీఆర్ఎస్ తలమునకలై ఉంది. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్‌లో పోటీ చేసే ఛాన్స్ ఎవరికి ఇస్తారనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చిన తరువాతే సీఎం కేసీఆర్ ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ తరపున హుజూరాబాద్‌లో పోటీ చేయబోయేది ఎవరనేది కూడా తేలలేదు. పార్టీ తరపున ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది.

    కేసీఆర్ దళితబంధు పథకాన్ని తట్టుకుని నిలబడాలంటే.. హుజూరాబాద్‌లో దళిత నాయకుడికి పోటీ చేసే ఛాన్స్ ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్టు సమాచారం. తాజాగా ఈ అంశంపై మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతోంది. హుజూరాబాద్‌లో బీజేపీకి సహకరించి దళిత ఓట్లు చీలేలా చేసేందుకు కాంగ్రెస్ ఇతర నియోజకవర్గానికి చెందిన దళిత నాయకుడిని పోటీలో పెట్టాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.

    హరీశ్ రావు ఆరోపణలు ఎలా ఉన్నా.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ తరపున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పోటీ చేస్తారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా హరీశ్ రావు సైతం హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దామోదరనే అన్నట్టుగా సంకేతాలు ఇవ్వడంతో.. కాంగ్రెస్ ప్లాన్ టీఆర్ఎస్‌కు లీకైందేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి హరీశ్ రావు చెప్పినట్టే కాంగ్రెస్ తరపున హుజూరాబాద్‌లో దళిత నేత బరిలోకి దిగుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published: