తలలు పగులుతాయ్.. శివసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

శివసేన పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీని చీల్చాలని ఎవరైనా చూస్తే.. వారి తలలను పగలకొడతామని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు.

news18-telugu
Updated: November 21, 2019, 4:39 PM IST
తలలు పగులుతాయ్.. శివసేన ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్
శివసేన లోగో
  • Share this:
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. పార్టీల పవర్ గేమ్ రోజుకో మలుపు తిరుగుతోంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి మహారాష్ట్ర వికాస అఘాడ పేరుతో కూటమి ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం. త్వరలోనే ఈ కూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పొత్తుపై శివసేనలో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ చీఫ్ ఉద్ధవ్ థాక్రే నిర్ణయాన్ని 17 మంది ఎమ్మెల్యేలు తప్పుబట్టినట్లు తెలుస్తోంది. శివసేనలో లుకలుకలు మొదలయ్యాయని.. వారికి బీజేపీ గాలం వేస్తోందన్న వార్తలు శివసేన శ్రేణులను కలవరపెడుతున్నాయి.

ఈ ఊహాగానాలపై శివసేన పార్టీ ఎమ్మెల్యే అబ్దుల్ సత్తార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన పార్టీని చీల్చాలని ఎవరైనా చూస్తే.. వారి తలలను పగలకొడతామని పరోక్షంగా బీజేపీని హెచ్చరించారు. కాళ్లు కూడా విరగొట్టి ఆస్పత్రిలో చేర్పిస్తామని.. తమ పార్టీ జోలికొస్తే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు చట్ట విరుద్ధమని.. ప్రభుత్వమంటే రిటైల్ షాప్ కాదని మండిపడ్డారు. ఇక శుక్రవారం పార్టీ ఎమ్మెల్యేలతో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే సమావేశం కాబోతున్నారు. మాతోశ్రీలో జరిగే ఈ భేటీకి ఎమ్మెల్యేలంతా ఐడీ కార్డులతో హాజరుకావాలని ఆదేశించారు ఉద్ధవ్.
First published: November 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>