ఆ లక్ష్యాన్ని చేరుకున్నాకే ఎన్నికలకు వెళ్తాం: ఏపీ డిప్యూటీ సీఎం

అక్టోబరు నుంచి ఏపీలో ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలను నడుపుతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ ఉండవు.

news18-telugu
Updated: September 6, 2019, 6:47 PM IST
ఆ లక్ష్యాన్ని చేరుకున్నాకే ఎన్నికలకు వెళ్తాం: ఏపీ డిప్యూటీ సీఎం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలుచేస్తామని ఎన్నికల ప్రచారంలోనే జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆ దిశగా చర్యలను వేగవంతం చేసింది ఏపీ సర్కార్. కొత్త మద్యం విధానాన్ని ప్రకటించడంతో పాటు సర్కారీ దుకాణాలను నడుపుతోంది. ఈ క్రమంలో మద్యం నిషేధంపై ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ మంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం లక్ష్యాన్ని చేరుకున్నాక ఎన్నికల బరిలో దిగుతామని తెలిపారు. గుేంటూరులో హోంమంత్రి సుచరితతో కలిసి నూతన మద్యం విధానంపై అధికారులో సమీక్ష నిర్వహించారు.

ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నాం. ఇప్పటికే వైన్ షాపులను తగ్గించాం. మద్యం కారణంగా చాలా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. మద్యానికి బానిసైన వారిలో నేరప్రవృత్తి పెరుగుతోంది. అన్ని వర్గాల వారు మద్యపాన నిషేధానికి సహకరించాలి. ఎన్టీఆర్ తర్వాత మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. మద్యపాన నిషేధం పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం.
నారాయణ స్వామి


అక్టోబరు నుంచి ఏపీలో ప్రభుత్వమే పూర్తిస్థాయిలో మద్యం దుకాణాలను నడుపుతుంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో షాపులకు పర్మిట్‌ రూమ్స్‌, లూజ్‌ సేల్స్‌ ఉండవు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మితే సిబ్బందిపై చర్యలు తప్పవు. ఒక వ్యక్తికి గరిష్ఠంగా మూడు బాటిళ్ల కంటే ఎక్కువ మద్యాన్ని అమ్మడానికి వీల్లేదు. ఎవరి వద్దనైనా 3 బాటిళ్లకు మించి ఎక్కువ దొరికితే వారిపై కేసులు నమోదు చేస్తారు.
First published: September 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>