ప్రత్యేక హోదాపై స్పందించిన ఏపీ సీఎం జగన్..

సీఎం జగన్

మౌలిక సదుపాయాల పరంగా ఏపీ చాలా బలంగా ఉందని అన్నారు. పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ తెలిపారు.

  • Share this:
    ఏపీకి ప్రత్యేక హోదాపై సీఎం జగన్ స్పందించారు. హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని, ఇవాళ కాకపోతే రేపైనా తప్పక వస్తుందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే ఇంకా ఎక్కువ ప్రోత్సాహకాలు వచ్చేవని ఆయన అన్నారు. ఇక, అవినీతి రహిత పాలనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పారిశ్రామికాభివృద్ధిపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మౌలిక సదుపాయాల పరంగా ఏపీ చాలా బలంగా ఉందని అన్నారు. పారిశ్రామిక వేత్తలకు కావాల్సిన భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. రివర్స్ టెండరింగ్తో ఇప్పటికే చాలా ప్రజాధనం ఆదా అయ్యిందని అన్నారు.

    ‘ఏపీకి 972 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. నాలుగు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులు ఉన్నాయి. 1400 కంపెనీలు రాష్ట్రంలో రూ.11,549 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా ఉన్నాయి. మరో 20 ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. కరోనా నేపథ్యంలో చిన్న పరిశ్రమలను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు ‘వైఎస్ఆర్ నవోదయం’ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందిస్తున్నాం’ అని జగన్ అన్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: