ఆర్టీసీ సమ్మెపై జడ్జిలతో కమిటీ.. హైకోర్టు సంచలన నిర్ణయం..

TSRTC Strike : ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమైంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు చర్చలకు ముందుకు రాకపోవడంతో ఇన్ని రోజులు ఓపిక పట్టిన న్యాయస్థానం సమ్మెపై కమిటీ వేసేందుకు రెడీ అవుతోంది.

news18-telugu
Updated: November 12, 2019, 6:18 PM IST
ఆర్టీసీ సమ్మెపై జడ్జిలతో కమిటీ.. హైకోర్టు సంచలన నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆర్టీసీ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు సిద్ధమైంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు చర్చలకు ముందుకు రాకపోవడంతో ఇన్ని రోజులు ఓపిక పట్టిన న్యాయస్థానం సమ్మెపై కమిటీ వేసేందుకు రెడీ అవుతోంది. సోమవారం వాయిదా పడిన ఈ కేసు విచారణను.. హైకోర్టు ఈ రోజు చేపట్టింది. ఈ సందర్భంగా సమ్మెపై సుప్రీం కోర్టు ముగ్గురు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తామని, రేపటిలోగా ప్రభుత్వాన్ని అడిగి నిర్ణయం చెప్పాలని ఏజీని ఆదేశించింది. అనంతరం విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా.. సమ్మె విషయంలో చర్చలు లేవన్న ప్రభుత్వం ఎస్మా ప్రకటించే ఆలోచనలో ఉండటంతో... అందుకు వీలు లేదని హైకోర్టు తెలిపింది. ఆర్టీసీ సేవలు... అత్యవసర సేవల కిందకు రాలేదనీ, అవి ప్రజా వినియోగ సేవలు మాత్రమే అన్న హైకోర్టు... ఎస్మా ప్రయోగించాలంటే... ఆ సేవల్ని ఎస్మా కిందకు తెస్తూ... ప్రత్యేక ఉత్తర్వులు జారీ చెయ్యాలని తెలిపింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మె ఎస్మా పరిధిలోకి వస్తుందని తెలిపారు. 1998, 2015లో ఆర్టీసీ ఎస్మా పరిధిలోకి తెస్తూ ప్రభుత్వం జీవోలు ఇచ్చిందని చెప్పారు.

దీంతో గతంలో ఇచ్చిన జీవోలు ఇప్పుడు వర్తిస్తాయా? అని హైకోర్టు ప్రశ్నించింది. 1998లో ఇచ్చిన ఉత్తర్వులు ఏపీఎస్‌ఆర్టీసీకి వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఇక, 2015లో ఇచ్చిన జీవో ఆరు నెలలకే పరిమితం అని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండగా, రేపు మధ్యాహ్నం 2:30 కి మళ్లీ విచారణ జరగనుంది.
First published: November 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading