Andhra Pradesh: జగన్ పార్టీకి మాజీమంత్రి షాక్.. టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారా ?

ప్రతీకాత్మక చిత్రం

DL Ravindra Reddy: మైదుకూరులో వైసీపీని ఢీ కొట్టాలంటే డీఎల్‌ లాంటి వారిని పార్టీలోకి తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ వచ్చిందేమో అనే వాదన కూడా వినిపిస్తోంది.

  • Share this:
    ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉండటంతో.. ఇప్పటివరకు సైలెంట్ ఉన్న కొందరు సీనియర్ నేతలు మళ్లీ పొలిటికల్‌గా యాక్టివ్ అవుతున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో మాజీమంత్రి కూడా చేరిపోయారు. ఆయనే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత డీఎల్ రవీంద్రారెడ్డి(DL Ravindra Reddy). రాజకీయాల్లో చంద్రబాబు, వైఎస్ఆర్ అంతటి సీనియర్ నాయకుడైన డీఎల్ రవీంద్రారెడ్డి... కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న సమయంలో పలుసార్లు మంత్రిగా పని చేశారు. వైఎస్ఆర్ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి(Kiran kumar reddy) కేబినెట్‌లో మంత్రిగా వ్యవహరించారు. అయితే రాష్ట్ర విభజన తరువాత ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయిన డీఎల్ రవీంద్రారెడ్డి.. 2019 ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోతున్నట్టు డీఎల్ రవీంద్రారెడ్డి ప్రకటించడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

    ఇదే సందర్భంలో ఏపీలోని అధికార వైసీపీ(Ysrcp) ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని అన్నారు. రాష్ట్ర మంత్రులెవరూ వారి శాఖలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టడం లేదని విమర్శించారు. సొంత ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పాలకులు పని చేస్తున్నారని దుయ్యబట్టారు. పాలకుల అక్రమాలను ప్రజలు నిలదీయాలని అన్నారు. దీంతో ఆయన వైసీపీకి వ్యతిరేకంగానే బరిలోకి దిగొచ్చనే చర్చ మొదలైంది.

    DL Ravindra Reddy may join tdp, DL Ravindra Reddy comments on ysrcp, DL Ravindra Reddy latest news, DL Ravindra Reddy of mydukuru, డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు టీడీపీలో చేరే ఛాన్స్, డీఎల్ రవీంద్రారెడ్డి లేటెస్ట్ న్యూస్, డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు
    డీఎల్ రవీంద్రారెడ్డి (ఫైల్ ఫోటో)


    మరోవైపు మైదుకూరులో వైసీపీని ఢీ కొట్టాలంటే డీఎల్‌ లాంటి వారిని పార్టీలోకి తీసుకోవడమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ వచ్చిందేమో అనే వాదన కూడా వినిపిస్తోంది. మైదుకూరులో టీడీపీ తరపున మాజీమంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు.

    Maa Elections 2021: మా ఎన్నికల ఎఫెక్ట్.. ఆ నినాదం ప్రభావం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఉంటుందా ?

    YS Jagan: జగన్‌ను టెన్షన్ పెడుతున్న వైఎస్ఆర్ సన్నిహితుడు.. వైసీపీలో టెన్షన్

    ఇక్కడ టీడీపీ తరపున రెండుసార్లు పోటీ చేసిన పుట్టా సుధాకర్ యాదవ్.. రెండుసార్లు వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో ఈసారి టీడీపీ కూడా ఆయనను పక్కనపెట్టి డీఎల్ రవీంద్రారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాను ఏదో ఒక పార్టీ తరపున బరిలో ఉంటానని చెబుతున్న డీఎల్ రవీంద్రారెడ్డి.. వైసీపీకి తాను వ్యతిరేకంగా ఉన్నాననే సంకేతాలను టీడీపీకి పంపించారని పలువురు చర్చించుకుంటున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: