Home /News /politics /

Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?

Etela Rajendar: ఈటల రాజేందర్ మాస్టర్ ప్లాన్.. అదే జరిగితే బీజేపీలో లెక్కలు మారతాయా ?

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)

Karimnagar: నిజానికి ఈ ఎన్నికల్లో తమకు సరైన బలం లేదనే కారణంగా బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. కానీ ఈటల రాజేందర్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచించారు.

    తెలంగాణలోని అధికార టీఆర్ఎస్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్ పట్టుకుంది. సాధారణంగా ఈ ఎన్నికల్లో ఎక్కువ బలం టీఆర్ఎస్‌కే ఉన్నప్పటికీ.. ఆ పార్టీ పట్ల స్థానిక ప్రజాప్రతినిధులకు ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకుని.. ఆ పార్టీ రెబల్ అభ్యర్థి రవీందర్ సింగ్‌ను గెలిపించుకోవాలని మాజీమంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్లాన్ చేశారు. కరీంనగర్‌లోని ఒక స్థానంతో పాటు అదిలాబాద్ స్థానంపై కూడా ఈటల రాజేందర్ గట్టిగా గురి పెట్టడంతో.. ఇప్పుడు ఆ రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం టీఆర్ఎస్ మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే ఈ స్థానాల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిలబడ్డ అభ్యర్థులను గెలిపించేందుకు మాజీమంత్రి ఈటల రాజేందర్ సర్వశక్తులు ఒడ్డుతుండటం టీఆర్ఎస్ నాయకత్వాన్ని టెన్షన్ పెడుతోంది.

    అందుకే ఈ ఎన్నికలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే మాజీమంత్రి ఈటల రాజేందర్ ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలపై ఎందుకు ఇంతలా ఫోకస్ చేశాడనే అంశం ఆసక్తికరంగా మారింది. తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించిన టీఆర్ఎస్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈటల రాజేందర్ ఈ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన ఒకవైపు వినిపిస్తోంది.

    మరోవైపు ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఈటల రాజేందర్ మరో ప్లాన్ కూడా ఉందనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. నిజానికి ఈ ఎన్నికల్లో తమకు సరైన బలం లేదనే కారణంగా బీజేపీ పోటీ నుంచి తప్పుకుంది. కానీ ఈటల రాజేందర్ మాత్రం ఈ విషయంలో భిన్నంగా ఆలోచించారు. టీఆర్ఎస్‌ను ఇబ్బందిపెట్టడంతో పాటు ఆ పార్టీపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని భావించారు.

    ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించలేకపోయినా.. ఆ పార్టీని టెన్షన్ పెట్టే స్థాయిలో ఈటల రాజేందర్ వ్యూహాలు ఉన్నాయన్నది చాలామంది అభిప్రాయం. ఇలా చేయడం వల్ల బీజేపీ అధినాయకత్వం దృష్టిలో పెడొచ్చన్నది ఈటల వ్యూహం కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పకడ్భందీ రాజకీయాలు చేసే నేతలు బీజేపీలో చాలా తక్కువగానే ఉన్నారు. అదే ఈటల రాజేందర్‌కు కలిసొచ్చే అంశమనే టాక్ వినిపిస్తోంది.

    KCR నయా వ్యూహం.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొడుతున్నారా ? అటు BJP.. మరోవైపు..

    ఆ హోదాపై టీఆర్ఎస్ నేతల ఆశలు.. కేసీఆర్ ఆలోచన ఏంటి ?

    Weight Loss: బరువు తగ్గాలని ట్రై చేస్తున్నారా.. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా చేయండి

    మీరు నాన్ వెజ్ తినరా ?.. అయితే ప్రొటీన్లు పుష్కలంగా లభించే ఈ ఆహారాలను తీసుకోండి..

    ఒకవేళ ఈటల రాజేందర్ వ్యూహాలు సక్సెస్ అయ్యి.. రవీందర్ సింగ్ విజయం సాధిస్తే.. బీజేపీలో ఆయన ఇమేజ్ మరింతగా పెరుగుతుందనే చర్చ కూడా సాగుతోంది. అంతేకాదు టీఆర్ఎస్‌ను ఈ స్థాయిలో ఇబ్బందిపెట్టే ఈటల రాజేందర్‌కు బీజేపీ నాయకత్వం కీలకమైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మొత్తానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్ వ్యూహాలు విజయవంతమైతే.. భవిష్యత్తులో బీజేపీ ఈటల లెక్క వేరుగా ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు.


    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Etela rajender, Telangana

    తదుపరి వార్తలు