హోమ్ /వార్తలు /రాజకీయం /

సీఎం యోగి, మాయావతి ఆ తర్వాత... ఎన్నికల సంఘం నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా ?

సీఎం యోగి, మాయావతి ఆ తర్వాత... ఎన్నికల సంఘం నెక్ట్స్ టార్గెట్ ఆయనేనా ?

అజం ఖాన్ (File)

అజం ఖాన్ (File)

ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న రాజకీయ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది.

  యూపీలో రాజకీయ వేడి ఊపందుకుంది. ఎలా అయినా సరే ఈసారి ఎన్నికల్లో గెలుపు సాధించి గట్టెక్కాలని అన్నిపార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో నేతలు నోటికి ఫుల్‌గా పనిచెబుతున్నారు. నోరు అదుపులో పెట్టుకోకుండా ప్రత్యర్థులపై విమర్శలు చేస్తున్నారు. వీరిని అదుపు చేయాల్నిన ఎన్నికల సంఘం, ఎన్నికల కోడ్ సైతం చేతులెత్తేసింది. దీంతో భారత అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది. నోటికొచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్న నాయకులను పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంటూ ఎన్నికల సంఘంపై సీరియస్ అయ్యింది.ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న రాజకీయ నేతలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. దీంతో ఈసీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిలపై చర్యలు తీసుకుంది. యోగి ఆదిత్యనాథ్ 72 గంటలు, మాయావతి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఇప్పుడు ఈసీ నెక్ట్స్ టార్గెట్ ఎవరు అన్న అంశంపై చర్చ మొదలయ్యింది.


  ఆజంఖాన్‌పై ఈసీ చర్యలు తీసుకోవడం గ్యారంటీ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న సమాజ్ వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆజంఖాన్ ఇటీవలకాలంలో నోరుపారేసుకుంటున్నారు. బీజేపీ నుంచి అదే ప్రాంతం నుంచి పోటీకి దిగుతున్న జయప్రదపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆజంఖాన్‌ వ్యవహారంపై జాతీయ మహిళ కమిషన్ సైతం సీరియస్ అయ్యింది. ఆయనకు నోటీసులు సైతం పంపింది. ఆజం వ్యాఖ్యలపై రాంపూర్‌లో పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇవన్నీ అయినా కూడా నెక్ట్స్ స్టెప్ మాత్రం ఈసీదే అంటున్నారు రాజకీయ నిపుణులు.


  ఆజం వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ బీజేపీ ఆజంపై వెంటనే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఈ ఎన్నికల్ల పోటీ చేయకుండా నిషేధం విధించాలని చెబుతోంది. జమ్ముకాశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ సైతం ఆజంఖాన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. ఆయనపై ఈసీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇటు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఆజంఖాన్-జయప్రద వ్యవహారంపై ఎట్టకేలకు స్పందించారు. మహిళలపై ఎంతటివారైనా సరే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ఉరుకునేది లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే... త్వరలో ఈసీ ఆజాంఖాన్‌పై యాక్షన్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

  First published:

  Tags: Akhilesh Yadav, Azam Khan, Jaya Prada, Samajwadi Party, Uttar Pradesh Lok Sabha Elections 2019

  ఉత్తమ కథలు