అమరావతి తరలిస్తే ఆమరణ దీక్ష.. మాజీ మంత్రి సంచలన ప్రకటన

Amaravati | ఆంధ్రప్రదేశ్ రాజధానిని మార్చేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే తాను ఆమరణ దీక్షకు కూడా వెనుకాడబోమని ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు.

news18-telugu
Updated: August 21, 2019, 5:37 PM IST
అమరావతి తరలిస్తే ఆమరణ దీక్ష.. మాజీ మంత్రి సంచలన ప్రకటన
ప్రత్తిపాటి పుల్లారావు, అమరావతి లోగో
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్రకంపనలు సృష్టిస్తోంది. అమరావతికి వరద ముంపు పొంచి ఉందన్న విషయం తాజా వరదలతో నిరూపితం అయిందని మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని అమరావతి నుంచి తరలిస్తే ఊరుకోబోమని మాజీ మంత్రి, టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు. ఒకవేళ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదిశగా అడుగులు వేస్తే ఉద్యమిస్తామని, అవసరమైతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని వైసీపీ ప్రభుత్వానికి ముక్కుతాడు వేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై కమిటీలను ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. అదే సమయంలో అమరావతి ప్రాజెక్టు నుంచి ప్రపంచబ్యాంక్ తప్పుకొంది. ఏఐఐబీ కూడా అమరావతికి సహకారం ఇచ్చే ప్రతిపాదనను విరమించుకుంది. ఈ క్రమంలో బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అమరావతి రాజధానిగా సరిపోదంటూ గతంలో శ్రీకృష్ణ కమిటీ కూడా ప్రతిపాదించింది. ఈ విషయాన్నే బొత్స సత్యనారాయణ చెప్పారు.

First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు