హోమ్ /వార్తలు /రాజకీయం /

చంద్రబాబు, లోకేష్‌కు కరోనా టెస్టులు... ఏపీ మంత్రి

చంద్రబాబు, లోకేష్‌కు కరోనా టెస్టులు... ఏపీ మంత్రి

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

స్థానిక నాయకత్వాలను కొత్త వారికి ఇవ్వాలని కొన్ని చోట్ల నుంచి టీడీపీ శ్రేణులు కోరడంతో... చంద్రబాబు అండ్ లోకేశ్ ఆ దిశగా దృష్టి పెట్టారని సమాచారం.

చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌కు కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు.

హైదరాబాద్‌లో రెండు నెలల పాటు ఉండి, ఇటీవల ఏపీకి వచ్చిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు కూడా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. టీడీపీ మహానాడులో చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ప్రభుత్వంపై చేసిన విమర్శలకు మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. ‘చంద్రబాబు రెండు నెలల తరువాత వచ్చి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. రాష్ట్రాన్ని ఎవరు దివాళా తీశారు ప్రజలకి తెలిసే బుద్ధి చెప్పారు.అధిక పన్నులు వసూలు చేస్తున్నారంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ ని టెస్ట్ చెయ్యలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు. కంగారుపడకండి మిమ్మల్ని కూడా టెస్ట్ చేయిస్తాం.’ అని అనిల్ కుమార్ అన్నారు.

LG పాలిమర్స్ కు, వైఎస్ జగన్ కు ఒకే లాయర్ ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. మంచి లాయర్ అయితే ఎవరైనా పెట్టుకుంటారన్నారు. లాయర్ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చెయ్యడం సిగ్గిచేటని అనిల్ మండిపడ్డారు. రైతులకు రూ.10,500 కోట్లు వరకూ సహాయం చేస్తే చంద్రబాబుకి ఏడుపు ఎందుకని ప్రశ్నించారు. వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ బ్రతికే చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీడీపీలో ఉన్న దొంగలు, రౌడీలు ఎక్కడా లేరని ఆరోపించారు. ఎమ్మెల్యేలు జారిపోతున్నారని భయంతో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మహానాడు పెట్టారని అనిల్ ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పటికీ జీరోనే.. జగన్ ఎప్పటికి హీరోనే అని అనిల్ కుమార్ అన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Anil kumar yadav, Chandrababu naidu, Nara Lokesh

ఉత్తమ కథలు