హోమ్ /వార్తలు /రాజకీయం /

చావడానికైనా ఇష్టపడుతా.. కానీ అలా మాత్రం చేయను : రాహుల్ గాంధీ

చావడానికైనా ఇష్టపడుతా.. కానీ అలా మాత్రం చేయను : రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

రాహుల్ గాంధీ(ఫైల్ ఫోటో)

అవినీతిలో నంబర్ వన్ అంటూ మోదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్-బీజేపీల మధ్య వ్యక్తిగత మాటల యుద్దం పెరిగింది.

  ప్రధాని నరేంద్ర మోదీ తమ కుటుంబాన్ని టార్గెట్ చేసినంత మాత్రానా.. తాను మోదీ కుటుంబాన్ని టార్గెట్ చేయనని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విమర్శలతో మోదీ కుటుంబాన్ని అవమానపరచడం కంటే చనిపోవడానికే ఇష్టపడుతానని చెప్పారు. మోదీని 'ప్రేమ'తోనే గెలుస్తానని, అంతే తప్ప ఆయన తల్లిదండ్రులపై విమర్శలకు దిగబోనని స్పష్టం చేశారు.


  మోదీ నా తండ్రిపై, నానమ్మపై, తాతపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. అయినా సరే, నా జీవితంలో నేనెప్పుడూ మోదీ కుటుంబాన్ని విమర్శల్లోకి లాగను. చావడానికైనా ఇష్టపడుతాను కానీ, మోదీ తల్లిదండ్రులను అవమానపరిచేలా మాట్లాడను. ఎందుకంటే నేను ఆర్ఎస్ఎస్, బీజేపీలకు చెందిన వ్యక్తిని కాను. నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని. మోదీ నాపై ఎంత విద్వేషం చూపించినా.. ప్రేమతోనే ఆయన్ను ఓడిస్తా.
  రాహుల్ గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు


  అవినీతిలో నంబర్ వన్ అంటూ మోదీ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విమర్శలు చేయడంతో కాంగ్రెస్-బీజేపీల మధ్య వ్యక్తిగత మాటల యుద్దం పెరిగింది. మోదీ వ్యాఖ్యలపై మండిపడ్డ ప్రియాంక గాంధీ ఆయన్ను దుర్యోధనుడితో పోల్చారు. కాంగ్రెస్ కౌంటర్ ఎటాక్‌తో మోదీ విమర్శల పదును మరింత పెంచారు. యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విరాట్‌ను తమ కుటుంబం విహారం కోసం వాడుకున్నారని రాజీవ్ గాంధీపై ఆరోపణలు చేశారు. దీంతో ఇరు పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.

  First published:

  Tags: Lok Sabha Elections 2019, Narendra modi, Rahul Gandhi, Rajiv Gandhi

  ఉత్తమ కథలు