నిజామాబాద్‌లో కవితకు షాక్ తగులుతుందా? గెలుపుపై బీజేపీ లెక్కలివే..

కవిత, అరవింద్

నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అక్కడ ఏకంగా 185 మంది ఎన్నికల్లో పోటీ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

 • Share this:
  నిజామాబాద్‌లో ఎవరు గెలుస్తారు? ఓ వైపు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కవిత, మరోవైపు బీజేపీ నుంచి డీఎస్ కుమారుడు అరవింద్, ఇంకోవైపు కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ పోటీ చేస్తున్నారు. వారితోపాటు 178 మంది రైతులు కూడా పోటీలో ఉన్నారు. నిజామాబాద్‌లో గెలుపు మీద బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. అక్కడ కేసీఆర్ కుమార్తె కవితకు షాక్ ఇస్తామని ధీమాగా ఉంది. అందుకు ప్రధాన కారణం టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అని బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. డి.శ్రీనివాస్ కుమారుడు అరవింద్ బీజేపీ నుంచి ఇక్కడ బరిలో నిలిచారు. డీఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత. ఆయనకు హస్తం పార్టీలోని చాలా మంది ద్వితీయశ్రేణి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తన పరిచయాలను ఉపయోగించుకుని డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులను బీజేపీకి అనుకూలంగా మార్చినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న మధుయాష్కీ తొలిదశలో పోరాటం చేసినా చివరి నిమిషంలో చేతులెత్తేసినట్టు స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.

  భర్త అనిల్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత


  ‘ఇది మోదీ, రాహుల్ మధ్య జరుగుతున్న యుద్ధం’ అని బీజేపీ నేతలు బలంగా ప్రచారం చేశారు. టీఆర్ఎస్ గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదని, సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవిత పసుపు బోర్డును తీసుకురాలేకపోయారని ముమ్మర క్యాంపెయినింగ్ నిర్వహించారు. దీంతో పాటు ‘పసుపు బోర్డు తీసుకురాలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా’ అంటూ అరవింద్ బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అయ్యాయి. ఇవన్నీ కలిపి తమను గెలిపిస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

  nizamabad lok sabha,turmeric,red jowar farmers,nizamabad farmers,dharmapuri arvind,mp kavitha,trs,bjp,lok sabhaelections 2019,నిజామాబాద్ రైతులు, పసుపుబోర్డు, ధర్మపురి అరవింద్, కవిత, లోక్‌సభ ఎన్నికలు
  ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి అరవింద్


  నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అక్కడ ఏకంగా 185 మంది ఎన్నికల్లో పోటీ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. మొత్తం బరిలో ఉన్న 185 మందిలో 178 మంది రైతులు కావడంతో దేశం దృష్టిని ఆకర్షించాయి.
  First published: