మల్కాజ్‌గిరిని నోయిడాగా మారుస్తా...ఎంపీ రేవంత్ రెడ్డి హామీ..

రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)

తెలంగాణ విభజన హక్కులపై పార్లమెంట్‌లో గళమెత్తుతానన్నారు రేవంత్ రెడ్డి. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వర్సిటీ వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని చెప్పారు.

 • Share this:
  తనను గెలిపించిన మల్కాజ్‌గిరి ప్రజలకు రుణపడి ఉంటాన్నానన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. తెలంగాణ సమస్యల్ని పార్లమెంట్‌లో వినిపించేందుకే తనను గెలిపించారని ఆయన చెప్పారు. ఈ గెలుపులో తన కంటే తెలంగాణ సాధించుకున్న విద్యార్థుల పాత్రే ఎక్కవగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. మల్కాజ్‌గిరి మరో నోయిడాగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని రాజ్యంగా భావించినందుకే లోక్‌సభ ఎన్నికలోల టీఆర్ఎస్ ఓడిపోయిందన్నారు.

  లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పారు. తెలంగాణను సీఎం కేసీఆర్‌ ఓ రాష్ట్రం కాకుండా రాజ్యమనుకున్నారు. తండ్రీ కొడుకుల అహంకారం అణిచేందుకే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యల్ని పరిష్కరించడమే నా తొలి ప్రాధాన్యత. నన్ను ఆశీర్వదించి గెలిపించిన మల్కాజ్‌గిరి ప్రజలకు రుణపడి ఉంటా.
  రేవంత్ రెడ్డి, మల్కాజ్‌గిరి ఎంపీ


  తెలంగాణ విభజన హక్కులపై పార్లమెంట్‌లో గళమెత్తుతానన్నారు రేవంత్ రెడ్డి. రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, ఉక్కు కర్మాగారం, ఖమ్మంలో గిరిజన వర్సిటీ వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతానని చెప్పారు. కాగా, గురువారం వెలువడిన లోక్‌సభ ఫలితాల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచారు. 10,919 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించారు.
  First published: