వైన్ షాపులు, బార్లపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం

అక్టోబరు నుంచి ఏపీలో వైన్ షాపులు, బార్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని జగన్ తెలిపారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగంం భారీగా తగ్గుతోందని వెల్లడించారు.

news18-telugu
Updated: August 30, 2019, 7:49 PM IST
వైన్ షాపులు, బార్లపై సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన జగన్ ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వాహణ జరగనుంది. ఈ క్రమంలో మద్యపాన నిషేధం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్. అక్టోబరు నుంచి ఏపీలో వైన్ షాపులు, బార్ల సంఖ్యను క్రమంగా తగ్గిస్తామని తెలిపారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపడంతో మద్యం వినియోగంం భారీగా తగ్గుతోందని వెల్లడించారు.

బెల్టుషాపుల‌పై ఉక్కుపాదం ఫ‌లితంగా మ‌ద్యం వినియోగం భారీగా త‌గ్గుతోంది. అక్టోబ‌ర్ నుంచి 20% మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని,నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం.
వైఎస్ జగన్, ఏపీ సీఎం


సెప్టెంబరు 1 నుంచి పైలట్ ప్రాతిపదికన ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మకం ప్రారంభం కానుంది. 474 దుకాణాలలో ఆదివారం నుంచి అమ్మకాలు జరగనున్నాయి. ఇక మద్యపాన నిషేధం కోసం డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అందు కోసం రూ.500 కోట్లు ఖర్చు చేయనుంది. మద్యపానం వల్ల ఎలాంటి అనారోగ్యాలు, అనర్థాలు వస్తాయనే అంశాలను పిల్లలకు పాఠ్యాంశాలుగా చేర్చాలని అధికారులను సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు.
First published: August 30, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>