ఎన్టీఆర్ అల్లుడు వైసీపీలో చక్రం తిప్పుతారా ? జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా ?

చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయాలనే ఆలోచన ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావును కచ్చితంగా తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 4, 2019, 12:44 PM IST
ఎన్టీఆర్ అల్లుడు వైసీపీలో చక్రం తిప్పుతారా ? జగన్ ఆ ఛాన్స్ ఇస్తారా ?
వైెఎస్ జగన్మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
టీడీపీ అధికార పగ్గాలు ఎన్టీఆర్ చేతుల్లో ఉన్నంత కాలం ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఆయన పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకరు. ఎంపీ, ఎమ్మెల్యేగా, మంత్రిగా, టీడీపీలో కీలక వ్యవహారాలను పరిశీలించిన వ్యక్తిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావుది సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఆ తరువాత ఆయన భార్య, ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి రాజకీయ అరంగ్రేటం చేయడంతో... కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో... రాజకీయంగా కాస్త సైలెంట్ అయిపోయారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. అయితే కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకొద్దామని భావించి... అది కుదరకపోవడంతో మళ్లీ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలుపుపై రాజకీయవర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ అధికారంలోకి వస్తే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. చంద్రబాబుకు కౌంటర్ ఇవ్వడంతో పాటు ఎన్టీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేయాలనే ఆలోచన ఉంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటి వెంకటేశ్వరరావును కచ్చితంగా తన కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. ఒకప్పుడు తనను టీడీపీ నుంచి దూరం చేసిన చంద్రబాబుపై రివెంజ్ తీర్చుకోవాలనే ఆలోచనతో ఉన్న దగ్గుబాటి కూడా అందుకు తగ్గ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.

అయితే ప్రకాశం జిల్లా నుంచి ఇప్పటికే జగన్ బాలినేని శ్రీనివాసరెడ్డిని మంత్రిని చేస్తానని ప్రకటించడంతో ... ఒకే జిల్లా నుంచి బాలినేని, దగ్గుబాటి ఇద్దరికీ మంత్రులయ్యే అవకాశం ఉంటుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. మొత్తానికి కుమారుడిని రాజకీయాల్లోకి తీసుకురాబోయి... అనుకోకుండా మళ్లీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి... మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
First published: May 4, 2019, 12:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading