ఈవీఎంలో సమస్యలుంటే వీవీప్యాట్లు లెక్కిస్తాం... ఏపీ ఎన్నికల అధికారి వ్యాఖ్య

ఈవీఎంలలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని ద్వివేది అన్నారు. రేపు 8 గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్ల కౌంటింగ్ ఉంటుందని ఆయన వివరించారు.

news18-telugu
Updated: May 22, 2019, 4:52 PM IST
ఈవీఎంలో సమస్యలుంటే వీవీప్యాట్లు లెక్కిస్తాం... ఏపీ ఎన్నికల అధికారి వ్యాఖ్య
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 22, 2019, 4:52 PM IST
ఓట్ల లెక్కింపు సందర్భంగా మధ్యాహ్నం 12 గంటలకు ట్రెండ్స్ తెలిసిపోతాయని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉందని అన్నారు. రేపటి కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ద్వివేది తెలిపారు. 36 కేంద్రాల్లో 350 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామని... అసెంబ్లీ, పార్లమెంట్ లకు వేర్వేరుగా పరిశీలకులను నియమించామని వెల్లడించారు. ఈ మొత్తం ప్రక్రియను పరిశీలించేందుకు రాష్ట్ర స్థాయిలో ఇద్దరు ప్రత్యేక పరిశీలకులు ఉన్నారని అన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఉంటుంది. సుమారు 25 వేల మంది పోలీసులు భద్రతలో ఉంటారని... 25 వేల మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని అన్నారు. అదనంగా 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయని ద్వివేది వివరించారు.

ఎలాంటి హింస,గొడవలు లేకుండా కౌంటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈవీఎంలలో సమస్యలు వస్తే పరిష్కరించేందుకు ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఇద్దరు బెల్ ఇంజినీర్లు అందుబాటులో ఉంటారని ద్వివేది అన్నారు. రేపు 8 గంటలకు పోస్టల్, సర్వీస్ ఓట్ల కౌంటింగ్ ఉంటుందని ఆయన వివరించారు. ఫలితాలు సువిధ యాప్,ఈసీఐ వెబ్ సైట్‌లో చూసుకోవచ్చని అన్నారు. రేపు అర్ధరాత్రికి మొత్తం తుది ఫలితాలు వెల్లడిస్తామని అన్నారు.ఈవీఎంలో సాంకేతిక సమస్యలుంటే వీవీ ప్యాట్‌లను లెక్కిస్తామని ద్వివేది తెలిపారు. కౌంటింగ్ తర్వాత రీపోలింగ్ జరిగే అవకాశం చాలా తక్కువ అని అన్నారు.First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...