టీడీపీకి ‘హ్యాండ్’ సహకరిస్తుందా ? చంద్రబాబు నిర్ణయం ఏమిటి ?

తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లో అయినా పోటీ చేయాలని భావించిన టీటీడీపీకి... స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామంటూ బుజ్జగించింది కాంగ్రెస్.

news18-telugu
Updated: April 23, 2019, 12:51 PM IST
టీడీపీకి ‘హ్యాండ్’ సహకరిస్తుందా ? చంద్రబాబు నిర్ణయం ఏమిటి ?
కాంగ్రెస్, టీడీపీ ఎన్నికల గుర్తులు
news18-telugu
Updated: April 23, 2019, 12:51 PM IST
టీడీపీ అవిర్భావం తరువాత తొలిసారిగా తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీ దూరంగా ఉంది. తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన తెలంగాణ టీడీపీ... ఓట్లు చీలిపోకూడదనే ఉద్దేశంతో లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కనీసం రెండు స్థానాల్లో అయినా పోటీ చేయాలని భావించిన టీటీడీపీకి... స్థానిక సంస్థల్లో ప్రాధాన్యత ఇస్తామంటూ బుజ్జగించింది కాంగ్రెస్. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా... టీడీపీకి బలం ఉన్న చోట ఆ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.

దీనికి తోడు చంద్రబాబు అంతా మీ ఇష్టం అని చెప్పడంతో... ఎన్నికలకు దూరంగా ఉండాలని టీటీడీపీ నేతలు నిర్ణయించుకున్నారు. అయితే లోక్ సభ ఎన్నికల ఫలితాలకు ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించడంతో... టీటీడీపీ ఏం చేయబోతోందనే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని మొత్తం 32 జడ్పీ చైర్ పర్సన్ స్థానాల్లో ఎన్నో కొన్ని గెలుచుకుని తమ పట్టు నిలుపుకోవాలని టీ టీడీపీ భావిస్తోంది. అయితే తెలంగాణ టీడీపీకి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో సహకరిస్తుందా అన్నది అనుమానంగా మారింది.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో తమకు సహకరించకపోతే అభ్యర్థుల గెలుపు అంత సులువుకాదని టీ టీడీపీ టెన్షన్ పెడుతోంది. మరోవైపు లోక్ సభ ఎన్నికల్లో పోటీ అంశంపై నిర్ణయాన్ని టీ టీడీపీకి వదిలేసిన చంద్రబాబు... స్థానిక సంస్థల్లో పోటీ చేసే విషయాన్ని కూడా తెలంగాణ తమ్ముళ్లకే వదిలేస్తారనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో టీ టీడీపీ పోటీ చేసి ప్రభావం చూపుతుందా లేక పోటీకి దూరంగా ఉండి మరింతగా బలహీనపడుతుందా అన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది.First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...