కారెక్కే కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరు? సర్వే లిస్టులో ఉన్నదెవరు?

అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డీలా పడిపోయింది. ఉద్ధండులుగా చెప్పుకొన్న నేతలు సైతం.. ఓడిపోవడంతో క్యాడర్‌ నిరాశలో మునిగిపోయింది. దీంతో గెలిచిన కొద్దిమంది ఎమ్మెల్యేలు సైతం అధికార పార్టీవైపు చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: January 8, 2019, 2:46 PM IST
కారెక్కే కాంగ్రెస్ ఎమ్మెల్యేలెవరు? సర్వే లిస్టులో ఉన్నదెవరు?
cong to trs file
  • Share this:
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఘోరంగా తయారైంది. కూటమిగా ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓటమిని మూటగట్టుకున్న హస్తం పార్టీకి ఇప్పుడు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఉద్ధండులు సైతం ఓటమిపాలైన పరిస్థితుల్లో.. టీఆర్ఎస్ హవాను తట్టుకుని 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తరపున గెలిచారు. అయితే, ఇప్పుడా గెలిచిన ఎమ్మెల్యేలైనా సైతం పార్టీలో ఉంటారా? లేదా? అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతోంది కాంగ్రెస్. అవన్నీ పుకార్లేనని, ఎవరూ పార్టీని వీడడం లేదని.. రాష్ట్ర నేతలు పైకి చెబుతున్నా లోలోపల జరగాల్సిన సెటిల్మెంట్లన్నీ జరిగిపోతున్నాయని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 10 నుంచి 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గూటికి చేరబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరంతా టీఆర్ఎస్ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని.. కారు పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.

Tpcc chief Uttam kumar reddy and kuntia positions are safe in telangana, hints congress chief Rahul Gandhi తెలంగాణలో ఉత్తమ్, కుంతియా సేఫ్... తేల్చేసిన కాంగ్రెస్‌ తెలంగాణలో పార్టీ ఓటమిపై పోస్టుమార్టం నిర్వహించిన కాంగ్రెస్ అధిష్టానం... ఇప్పటికిప్పుడు టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియాలను మార్చడం వల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదని నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా( Image: facebook)


ఇప్పటికే మండలిలో ప్రతిపక్ష హోదా పోగొట్టుకున్న కాంగ్రెస్‌.. ఇప్పుడు అసెంబ్లీలోనూ అదే పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తోంది. కానీ, ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌తోనే ఉంటారని టీపీసీసీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, తాజాగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన సీనియర్ సర్వే సత్యనారాయణ మాటలు వింటుంటే.. టీపీసీసీ ధీమా ఉత్తదేనని స్పష్టమవుతోంది. ఉత్తమ్, కుంతియా తీరును భరించలేక గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు చూస్తున్నారని సర్వే చెప్పడం రాజకీయంగా మరింత కలకలం రేపింది.

కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ
కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణ
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంత మంది టీఆర్ఎస్‌లోకి వెళ్తున్నారో, తన దగ్గర లిస్టు ఉందంటూ బాంబు పేల్చారు సర్వే సత్యనారాయణ. వారంతా ఉత్తమ్, కుంతియాల కారణంగానే పార్టీని వీడబోతున్నారని చెప్పారు. తనలాగే ఎంతోమంది నేతలను ఉత్తమ్ అవమానించారని, రాబోయే రోజుల్లో మరిన్ని తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని తెలిపారు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరతారని పుకార్లు వినిపిస్తున్నా.. ఆ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని సత్యనారాయణ చెప్పడం విశేషం.

కేటీఆర్, శ్రీధర్‌బాబు


సర్వే వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌లో దుమారం రేగింది. ఇంతకీ సర్వే చెప్పిన లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరై ఉంటారనే చర్చ మొదలైంది. టీఆర్ఎస్‌లో చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేల లిస్టులో ఇప్పటికే సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, గండ్ర వెంకట రమణారెడ్డి, జగ్గారెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. సర్వే చెప్పిన లిస్టులో వీరి పేర్లకు తోడు మరికొందరు కూడా ఉండి ఉంటారని, వారెవరై ఉంటారనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఇంకొన్నాళ్లు ఆగితే, ఆ లిస్టులో ఉన్న జంప్ జిలానీలెవరనేది తెలిసే అవకాశం ఉంది.
First published: January 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>