హోమ్ /వార్తలు /National రాజకీయం /

Huzurabad: ‘హుజూరాబాద్‌’పై రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తుందా ?

Huzurabad: ‘హుజూరాబాద్‌’పై రేవంత్ రెడ్డికు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇస్తుందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Revanth Reddy: ఇటీవల పార్టీ సమావేశంలో ఈ అంశంపై జరిగిన చర్చను బట్టి చూస్తే.. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వనుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

  కాంగ్రెస్ రాజకీయాలు మిగతా పార్టీల కంటే భిన్నంగా ఉంటాయి. అక్కడ ఏ నాయకుడికి ఎప్పుడు ప్రాధాన్యత లభిస్తుందో.. ఎవరి మాట ఎప్పుడు చెల్లుబాటు అవుతుందో చెప్పడం చాలా కష్టం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఆయన టీపీసీసీ చీప్ అయిన తరువాత కాంగ్రెస్‌పై పట్టు బిగించేందుకు ఆయన తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంతవరకు సక్సెస్ సాధించారనే టాక్ కూడా ఉంది. ఇక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించేలా చేయడం ద్వారా తన సత్తా చూపించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అయితే హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు ఫలితాలు సాధిస్తుందనే విషయం అక్కడ పోటీ చేయబోయే అభ్యర్థిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ గట్టిగా నమ్ముతోంది.

  ఈ కారణంగానే అక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని యోచించింది. ఈ క్రమంలోనే మాజీమంత్రి కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. హుజూరాబాద్‌ నుంచి కొండా సురేఖను పోటీ చేయించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అండ్ టీమ్ చాలానే శ్రమించిందని.. ఇందుకోసం కొండా దంపతులను ఒప్పించిందనే చర్చ సాగింది. దీంతో హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కొండా సురేఖ పోటీ చేయడం దాదాపు ఖాయమనే టాక్ వినిపించింది. అయితే ఇటీవల పార్టీ సమావేశంలో ఈ అంశంపై జరిగిన చర్చను బట్టి చూస్తే.. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డికి షాక్ ఇవ్వనుందా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.

  రేవంత్ రెడ్డి వర్గం హుజూరాబాద్‌లో కొండా సురేఖను బరిలోకి దింపాలని యోచిస్తుండగా.. కాంగ్రెస్‌లోని పలువురు ముఖ్యనేతలు అక్కడ స్థానిక నేతలను మాత్రమే రంగంలోకి దింపాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు మాణిక్యం ఠాగూర్‌కు సూచించింది. స్థానికులు కాకపోయినా.. కనీసం ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలనైనా బరిలోకి దింపాలని సూచించారు. ఈ రకంగా కొండా సురేఖకు ఛాన్స్ ఇవ్వొద్దని పరోక్షంగా కాంగ్రెస్ హైకమాండ్‌కు పలువురు సూచించినట్టు వార్తలు వచ్చాయి.

  దీంతో స్థానిక నాయకులకు అవకాశం ఇచ్చేలా ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని మాణిక్యం ఠాగూర్‌ టీపీసీసీకి సూచించినట్టు తెలుస్తోంది. అయితే కొండా సురేఖ కాకుండా హుజూరాబాద్‌లో మరో నాయకుడు బరిలోకి దిగితే రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై అంతగా ఫోకస్ చేసే అవకాశం ఉండకపోవచ్చనే చర్చ జరుగుతోంది. ఈ ఉప ఎన్నిక ఫలితాన్ని పట్టించుకోకుండా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు.

  Huzurabad: హుజూరాబాద్‌లో పోటీకి దూరం.. ఆ పార్టీ ప్రకటన.. టీఆర్ఎస్‌కు మద్దతిస్తుందా ?

  Night: రాత్రిపూట తరచూ గొంతు తడారిపోతుందా ?.. చాలా డేంజర్.. దేనికి సంకేతమో తెలుసా..

  మరోవైపు రేవంత్ రెడ్డి అభిప్రాయం తీసుకోకుండా.. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ హైకమాండ్ హుజూరాబాద్ అభ్యర్థిని ఎంపిక చేస్తుందా ? అనే చర్చ కూడా కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర రేవంత్ రెడ్డికి ఎంత ప్రాధాన్యత ఉందనే విషయం హుజూరాబాద్ అభ్యర్థి ఎంపికను బట్టి తేలిపోతుందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Huzurabad By-election 2021, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు