హోమ్ /వార్తలు /politics /

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

Revanth Reddy ముందస్తు వ్యూహం.. KCR ప్లాన్‌కు కౌంటర్.. Congress హైకమాండ్ ఓకే చెబుతుందా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana News: గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారని గట్టి నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్టుగానే తాము కూడా సిద్ధమవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

  తెలంగాణ రాజకీయాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయా ? అన్నది సీఎం కేసీఆర్ చేతుల్లోనే ఉంటుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. మిగతా పార్టీలు రాజకీయంగా కొంతమేర బలపడుతున్నప్పటికీ.. గులాబీ బాస్ కేసీఆర్ (KCR)  మళ్లీ టీఆర్ఎస్‌కు రాజకీయంగా అనుకూల వాతావరణం ఏర్పడేందుకు చర్యలు తీసుకుంటారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తుంటారు. కేసీఆర్ వ్యూహాలే మళ్లీ తమను రాజకీయంగా అందరికంటే ముందు నిలుపుతాయన్నది వారి నమ్మకం. కేసీఆర్‌ను ఢీ కొట్టాలని చూసే ప్రత్యర్థులు కూడా ఆయన ఏ రకమైన వ్యూహాలను అమలు చేయబోతున్నారనే అంశంపై ఓ కన్నేసి ఉంచుతారు. తెలంగాణ(Telangana)  రాజకీయాల్లో కాంగ్రెస్ తరపున టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి (Revanth Reddy).. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సారథ్యంలోని అధికార టీఆర్ఎస్‌ను ఢీ కొట్టబోతున్నారు. ఇందుకోసం ఆయన ముందుగానే వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు.

  గతంలో మాదిరిగానే సీఎం కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళతారని గట్టి నమ్మకంతో ఉన్న రేవంత్ రెడ్డి.. అందుకు తగ్గట్టుగానే తాము కూడా సిద్ధమవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ తమ పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చినా.. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ మరోసారి కచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతోనే ఉన్నారని రేవంత్ రెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే కేసీఆర్ అలాంటి నిర్ణయం తీసుకుంటే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు ముందుగానే సిద్ధంగా ఉండాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన అధిష్టానంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారనే చర్చ జరుగుతోంది.

  గత ఎన్నికల్లో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ బాగా వెనుకబడిపోయిందని.. ఎన్నికలు దగ్గరపడిన సమయంలోనూ టికెట్ల విషయంలో క్లారిటీ రాక ఇబ్బందిపడిందనే భావనలో ఉన్న రేవంత్ రెడ్డి.. మరోసారి అలాంటి పరిస్థితి రాకూడదని అనుకుంటున్నారు. అందుకే ముందస్తు ఎన్నికలు వస్తాయని భావించి.. ముందుగానే అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక అంశంపై కూడా ఓ స్పష్టతకు రావాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం పెద్దలతో చర్చిస్తున్నారని టాక్.

  Maida Flour: మైదా పిండి అనేక ఆరోగ్య సమస్యలు కారణమని మీకు తెలుసా ?

  After Eating: భోజనం చేసిన తరువాత ఈ పనులు చేయొచ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

  అయితే టికెట్ల విషయంలో మిగతా పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్‌లో పోటీ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ సమస్య పరిష్కారానికి ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీ కోసం పోరాడిన వారికే టికెట్లు ఇవ్వాలని.. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలనే యోచనతో రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళితే.. ముందస్తుగా కాంగ్రెస్ పార్టీని ఎన్నికల కోసం ఎలా సిద్ధం చేస్తారన్నది హాట్ టాపిక్‌గా మారింది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: CM KCR, Revanth Reddy, Telangana

  ఉత్తమ కథలు