తెలంగాణలో కాంగ్రెస్ ‘బాండ్’ వ్యూహం ఫలిస్తుందా ?

పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వాళ్లు పార్టీ మారబోమంటూ రూ. 20 బాండ్ పేపర్‌పై సంతకం చేసి ఇవ్వాలంటూ కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది.


Updated: April 18, 2019, 3:07 PM IST
తెలంగాణలో కాంగ్రెస్ ‘బాండ్’ వ్యూహం ఫలిస్తుందా ?
రాహుల్ గాంధీతో ఉత్తమ్( File)

Updated: April 18, 2019, 3:07 PM IST
తమ పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు పార్టీ మారకుండా ఉండేందుకు తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వినూత్న ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా కాంగ్రెస్ తరపున గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు అన్ని స్థాయిల్లోని నాయకులు టీఆర్ఎస్ సహా ఇతర పార్టీల్లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ ద్వారా వారికి దక్కిన పదవులు వదులుకోకుండానే వారంతా ఇతర పార్టీల్లోకి ఫిరాయించడంపై పార్టీ వర్గాల్లో పెద్ద చర్చే జరిగింది. అయితే ఇప్పటికీ పార్టీ ద్వారా పదవులు దక్కించుకుంటున్న నేతలు ఇతర పార్టీల్లోకి ఫిరాయించే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

అయితే ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలని భావించిన కాంగ్రెస్... పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే వాళ్లు పార్టీ మారబోమంటూ రూ. 20 బాండ్ పేపర్‌పై సంతకం చేసి ఇవ్వాలంటూ కొత్త నిబంధన విధించింది. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఈ నిబంధనను అమలులోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించుకుంది. బాండ్ పేపర్ ఇచ్చి కూడా పార్టీ మారితే... వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అవకాశం దక్కుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆశించిన స్థాయిలో ప్రయోజనం ఉంటుందా లేదా అనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ప్రజల్లో పార్టీ అభ్యర్థుల పట్ల నమ్మకం కలిగించేందుకే ఈ కొత్త ప్రయోగం పని కొస్తుందనే వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ మారాలని నిర్ణయించుకున్న వారిని... అధికార పార్టీ ఒత్తిడి చేసే వారిని ఇలాంటి బాండ్లు అడ్డుకుంటాయా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు చట్టపరంగా ఈ బాండ్లు ఎంతవరకు నిలుస్తాయన్నది చెప్పలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు.First published: April 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...