Home /News /politics /

WILL CM YS JAGAN MOHAN REDDY OFFER MINISTER POST FOR BHIMAVARAM MLA GRANDHI SRINIVAS WHO DEFEATED PAWAN KALYAN AK

YS Jagan: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్.. ఆ ఎమ్మెల్యేకు సీఎం జగన్ మంత్రి పదవి ఇస్తారా ?

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)

Bhimavaram MLA: పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే గాజువాకతో పోల్చితే భీమవరంలో పవన్ కళ్యాణ్ వైసీపీకి మరింత గట్టి పోటీ ఇచ్చారు.

    ఆంధ్రప్రదేశ్‌లో రెండున్నరేళ్లు దాటిన తరువాత ఇప్పుడున్న మంత్రుల్లో ఎక్కువమందిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇస్తానని సీఎం జగన్ ముందే ప్రకటించారు. ఆ సమయం దగ్గర పడుతుండటంతో.. సీఎం జగన్ కొత్తగా ఎవరికి తన కేబినెట్‌లో చోటు కల్పిస్తారనే దానిపై చర్చ మొదలైంది. మరోవైపు కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరిగితే.. అందులో చోటు దక్కించుకునేందుకు అనేక మంది పోటీ పడుతున్నారు. కొందరు ఇప్పటి నుంచే తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న కొంతమంది మంత్రులను మినహాయిస్తే.. ఎక్కువమందికి స్థాన చలనం తప్పకపోవచ్చనే ఊహాగానాలు ఏపీ రాజకీయవర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరికి వారే సీఎం జగన్ కేబినెట్‌లో చోటుపై ఆశలు పెట్టుకున్నారు. ఆ జాబితాలో తాజాగా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కూడా చేరిపోయారని తెలుస్తోంది.

    ఏపీలోని ఎమ్మెల్యేల్లో గ్రంధి శ్రీనివాస్‌కు ఓ ప్రత్యేకత ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించిన వైసీపీ ఎమ్మెల్యే ఈయన. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరం స్థానాల్లో వైసీపీ గెలిచింది. అయితే గాజువాకతో పోల్చితే భీమవరంలో పవన్ కళ్యాణ్ వైసీపీకి మరింత గట్టి పోటీ ఇచ్చారు. అయినా ఇక్కడి వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్‌పై విజయం సాధించి వైఎస్ జగన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. నిజానికి అప్పట్లోనే తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆయన ఆశించారు.

    కానీ అలా జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం తనకు చోటు దక్కుతుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మళ్లీ భీమవరంపై ఫోకస్ చేశారనే వార్తలు కూడా ఇందుకు దోహదం చేస్తాయని ఆయన నమ్ముతున్నారు. రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మళ్లీ భీమవరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడానికి గ్రంధి శ్రీనివాస్‌ మంత్రిగా ఉంటే కలిసొస్తుంది.

    Harish Rao: టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీశ్‌రావుకు వింత పరిస్థితి.. ప్లస్సా ? మైనస్సా ?

    Revanth Reddy: రేవంత్ రెడ్డిని నిరాశ పరిచిన రాహుల్ గాంధీ.. ఆ ప్లాన్ ఫలించలేదా ?

    ఇదే విషయాన్ని ఆయన కొందరు ముఖ్యనేతల ద్వారా సీఎం జగన్ సన్నిహితుల దృష్టికి తీసుకెళ్లారని టాక్. ఒకవేళ సీఎం జగన్ ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. తనకు ఈసారి మంత్రి పదవి గ్యారంటీ అనే భావనలో భీమవరం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి పవన్ కళ్యాణ్‌ను ఓడించిన నేతల్లో ఒకరైన భీమవరం ఎమ్మెల్యేకు సీఎం జగన్ మంత్రి పదవి ఇస్తారా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Bhimavaram, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు