• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • WILL CM YS JAGAN MOHAN REDDY NAME MACHILIPATNAM AS NTR DISTRICT AK

ఎన్టీఆర్ విషయంలో జగన్ హామీ నెరవేరుతుందా ?

ఎన్టీఆర్ విషయంలో జగన్ హామీ నెరవేరుతుందా ?

ఎన్టీఆర్, జగన్

తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని తన పాదయాత్ర సందర్భంగా జగన్ ప్రకటించారు.

  • Share this:
    ఏపీ సీఎం జగన్ రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకున్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం ఈ జిల్లాల ఏర్పాటును వేగంగా చేపట్టాలని భావిస్తున్నారు. మచిలీపట్నం, పల్నాడుతో పాటు అరకు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించిన ఏపీ ప్రభుత్వం... ఈ ప్రక్రియను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలనే భావనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూడు జిల్లాలో ఒకటైన మచిలీపట్నం జిల్లాకు సీఎం జగన్ ఏ పేరు పెడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. సాధారణంగా మచిలీపట్నం జిల్లాకు అదే పేరు కొనసాగించవచ్చు.

    అయితే తాను అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానని జగన్ తన పాదయాత్ర సందర్భంగా ప్రకటించారు. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు కాబోయే మచిలీపట్నం జిల్లా పరిధిలోకి ఎన్టీఆర్ సొంత నియోజకవర్గమైన గుడివాడ కూడా చేరనుంది. దీంతో మచిలీపట్నం జిల్లాకు వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు పెడుతుందా ? అనే చర్చ మొదలైంది.

    మరోవైపు ఈ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టే విషయంలో స్వయంగా సీఎం జగన్ హామీ ఇచ్చి ఉండటంతో... ఆయన దీనిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ సీఎం జగన్ అలా చేయకపోతే... టీడీపీకి ఇది సరికొత్త రాజకీయ ఆయుధంగా మారే అవకాశం కూడా లేకపోలేదనే చర్చ కూడా జరుగుతోంది. మరి... ఎన్టీఆర్‌ పేరుతో జిల్లా ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: