'మోదీ వైపు వేలుచూపిస్తే..నరికేస్తా'..బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

సత్‌పాల్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్

గతవారం ఇలాగే రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురయ్యారు సత్‌పాల్. ఏప్రిల్ 13న చేసిన ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్న ఈసీ..సత్‌పాల్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది.

 • Share this:
  దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఐతే ఎన్నికల ప్రచారంలో కొందరు నేతలు హద్దు మీరుతున్నారు. ఓటర్లను ఆకట్టుకునే క్రమంలో రెచ్చగొట్టే ప్రసంగాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈసీ చర్యలు తీసుకుంటున్నా..నేతల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్ సత్‌పాల్ సింగ్‌ సైతం ఆ జాబితాలో చేరారు. మోదీ వైపు వేలెత్తితే..వాళ్ల వేళ్లు నరికేస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు.

  ఎవరైనా ప్రధాని మోదీ వైపు వేలుచూపిస్తే..వాళ్ల వేళ్లను నరికేసి చేతిలో పెడతాం.
  సత్‌పాల్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ చీఫ్
  గతవారం ఇలాగే రాహుల్ గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి ఈసీ ఆగ్రహానికి గురయ్యారు సత్‌పాల్. ఏప్రిల్ 13న చేసిన ఆయన వ్యాఖ్యలపై చర్యలు తీసుకున్న ఈసీ..సత్‌పాల్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. నిషేధం ఎత్తివేయడంతో మళ్లీ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న సత్‌పాల్..మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
  First published: