వైసీపీలో ఓటమి... బీజేపీలోకి చంద్రబాబు తోడల్లుడు ?

పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కచ్చితంగా గెలుస్తారని... అసెంబ్లీలో ఆయనకు స్పీకర్ పదవి దక్కుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

news18-telugu
Updated: June 27, 2019, 8:04 PM IST
వైసీపీలో ఓటమి... బీజేపీలోకి చంద్రబాబు తోడల్లుడు ?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు,చంద్రబాబునాయుడు
  • Share this:
ఎన్టీఆర్ పెద్దల్లుడు, సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయ పయనం ఎటు అనే అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు... గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పోటీలో నిలవాల్సి వచ్చింది. కుమారుడు హితేష్‌ను వైసీపీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దింపాలని భావించిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు... సమయానికి కుమారుడి అమెరికా పౌరసత్వం రద్దు కాకపోవడంతో ఆయనే ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పర్చూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కచ్చితంగా గెలుస్తారని... అసెంబ్లీలో ఆయనకు స్పీకర్ పదవి దక్కుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి.

అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోవడంతో... ఆయన రాజకీయ అడుగులు ఎటు వైపు అనే సందేహాలు మొదలయ్యాయి. ఏపీలో బీజేపీ బలపడాలని భావిస్తున్న నేపథ్యంలో... దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడితో కలిసి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి ఓ పరిస్థితి వస్తే పరిస్థితి ఏంటనే దానిపై ముందుగానే ఊహించిందో ఏమో తెలియదు కానీ... దగ్గుబాటి వెంకటేశ్వరరావు భార్య, మాజీ కేంద్రమంత్రి పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు వారికి ఇదే కలిసొచ్చే అంశంగా మారిందని తెలుస్తోంది.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇక పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే అని... ఆయన కుమారుడు హితేష్ మాత్రం వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. తల్లి పురంధేశ్వరి సూచనలతో హితేష్ రాజకీయాల్లో రాణించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు బీజేపీలోకి వెళతారా లేక తనయుడి పొలిటికల్ కెరీర్ బాధ్యతలను భార్యకు వదిలిపెట్టి రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెబుతారా అన్నది చూడాలి.First published: June 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>