జగన్, చంద్రబాబు ఎదురయ్యే వేళ.. మాజీ సీఎం ముఖం చూపిస్తారా? చాటేస్తారా?

చంద్రబాబునాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. గవర్నర్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరవుతారా? లేదా?

news18-telugu
Updated: June 1, 2019, 9:03 AM IST
జగన్, చంద్రబాబు ఎదురయ్యే వేళ.. మాజీ సీఎం ముఖం చూపిస్తారా? చాటేస్తారా?
చంద్రబాబు, వైఎస్ జగన్
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 1న ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఆయన హైదరాబాద్‌లో హాజరవుతున్న మొదటి కార్యక్రమం ఇదే. అయితే, గవర్నర్ ఇఫ్తార్ విందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డితో పాటు ప్రతిపక్ష నాయకులు, వివిధ పార్టీలకు కూడా ఆహ్వానాలు అందుతాయి. ఈ ప్రకారం ఏపీలో ప్రతిపక్షం నుంచి చంద్రబాబుకు కూడా గవర్నర్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానం అందుతుంది. ఎన్నికల్లో జగన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తర్వాత చంద్రబాబునాయుడు.. గవర్నర్ ఇచ్చే ఇఫ్తార్ విందుకు హాజరవుతారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి తన ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఫోన్ చేసి పిలిచారు. అయితే, ప్రమాణస్వీకారానికి హాజరుకాని చంద్రబాబు ఓ లేఖ ద్వారా అభినందనలు తెలిపారు.

చంద్రబాబునాయుడు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్నారు. ఆయన పలు వైద్య పరీక్షలు కూడా చేయించుకున్నారు. పలువురు పార్టీ నేతలు తనను కలవగా, వారితో ముచ్చటించారు. కొందరు తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుతో సమావేశమై.. ఎన్నికల ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణ మీద చర్చించారు. అయితే, జగన్‌ సీఎంగా హాజరయ్యే ఇఫ్తార్ పార్టీకి చంద్రబాబు హాజరవుతారా? లేదా అనేది ఉత్కంఠగా మారింది.

First published: June 1, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు