జగన్‌కు నేడు కీలకం... సీబీఐ కోర్టు షాక్ ఇస్తుందా? ఊరటనిస్తుందా?

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (File)

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద నేడు విచారణ జరగనుంది.

  • Share this:
    ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి ఎలాంటి మినహాయింపు ఇవ్వొద్దంటూ సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్‌పై శుక్రవారం సీబీఐ కోర్టులో వాదనలు జరగబోతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో నిమగ్నమై ఉంటారని, ప్రతి వారం కోర్టుకు హాజరుకావడం వల్ల పరిపాలనలో ఇబ్బందులు వస్తాయి కాబట్టి, జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ గతంలో ఆయన తరఫు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. వైఎస్ జగన్ గతంలో అరెస్టై జైలులో ఉన్నప్పుడే సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని, అప్పట్లో ఆయన కేవలం ఎంపీ మాత్రమేనని, ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు కాబట్టి సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేడు రెండు పక్షాలూ బలమైన వాదనలు వినిపించే అవకాశాలున్నాయి.

    పులి పిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండి
    First published: