WILL BSP DOWNFALL SHOWS ITS EFFECT ON RS PRAVEEN KUMAR IN TELANGANA HERE IS THE DETAILS AK
RS Praveen Kumar: ఆర్ ప్రవీణ్ కుమార్‌పై ఆ ఎఫెక్ట్ ఉంటుందా ? అలా జరిగితే ఇబ్బందులేనా ?
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో)
RS Praveen Kumar: మాయావతి సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బీఎస్పీ 20 సీట్లకు లోపే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి.
ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకుని తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. రాష్ట్ర రాజకీయాల్లో సత్తా చాటాలని భావిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బలం పుంజుకోవాలని అనుకుంటున్నారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. బహుజనులను ఏకం చేసి వారిని రాజ్యాధికారంలో భాగం చేయాలన్న లక్ష్యంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. కాంగ్రెస్ వంటి పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన పెద్దగా చేయడం లేదని తెలుస్తోంది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న పలు స్థానాలపై ఆయన ఫోకస్ చేస్తున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని తుంగతుర్తి స్థానంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దృష్టి పెట్టారని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వ్యక్తిగతంగా ఓ వర్గంలో క్రేజ్ బాగానే ఉన్నా.. ఆయన మాయావతి సారథ్యంలోని బీస్పీలో చేరారు. తెలంగాణ బీఎస్పీ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. ఆ పార్టీ జెండా మీదే ఆయన రాజకీయాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీఎస్పీ ప్రభావం తగ్గిపోతోంది.
మాయావతి సొంత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లోనూ బీఎస్పీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఆ రాష్ట్రంలో బీఎస్పీ 20 సీట్లకు లోపే పరిమితమవుతుందని సర్వేలు అంచనా వేశాయి. దీంతో యూపీలో ప్రభావం చూపలేకపోతున్న బీఎస్పీ ద్వారా తెలంగాణలో రాజకీయాలు చేయడం ద్వారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంతమేరకు సక్సెస్ అవుతారనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిజానికి రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశ్యంతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు.
మొదట్లో ఆయన సొంత పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగింది. ఆయన కూడా ఆ దిశగా అడుగులు వేసినట్టు ప్రచారం జరిగింది. కానీ చివరకు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీలో చేరిన ప్రవీణ్ కుమార్.. తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్‌గా నియమితులయ్యారు. తెలంగాణలో బీఎస్పీని బలోపేతం చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల బీఎస్పీ బలహీనపడుతుండటంతో.. ఆ ప్రభావాన్ని తట్టుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో ఏ మేరకు రాజకీయాల్లో రాణిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.