Home /News /politics /

WILL BJP AND TRS TRYING TO TARGET CONGRESS AND REVANTH REDDY IN TELANGANA AK

Telangana: రేవంత్ రెడ్డికి టీఆర్ఎస్, బీజేపీ కలిసి షాక్ ఇవ్వనున్నాయా ?

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటో)

Telangana: కాంగ్రెస్ ముఖ్యనేతలపై టీఆర్ఎస్, బీజేపీ ఫోకస్ చేస్తే.. అందుకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తి కలిగించే అంశమే.

    తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు ఆసక్తికరంగా మారుతున్నాయి. అధికార టీఆర్ఎస్‌ను ఢీ కొట్టేందుకు బీజేపీ ప్లాన్ చేస్తుంటే.. మళ్లీ శక్తి పుంజుకుని అధికార పార్టీతో పోరాడేందుకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ నేతల మధ్య పెద్ద ఐక్యత, సఖ్యత లేకపోవడంతో.. ఆ పార్టీ అధికార పార్టీకి ఏ మేరకు పోటీ ఇస్తుందన్న విషయంలో సందేహాలు నెలకొన్నాయి. ఇక తెలంగాణలో ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. రాష్ట్రంలోని అనేక నియోజకర్గాల్లో బలమైన నాయకులు అవసరమని భావిస్తోంది. ఇందుకోసం ఇతర పార్టీల నేతలపై ఫోకస్ చేసింది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలు బీజేపీ వైపు చూసే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలు, బలమైన నేతలపై బీజేపీ నాయకత్వం దృష్టి పెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే బీజేపీ ఈ రకమైన వ్యూహంతో ముందుకు సాగే అవకాశం ఉందని తెలుసుకున్న గులాబీ పార్టీ.. వారి కంటే ముందే కాంగ్రెస్‌లోని ముఖ్యనేతలను తమ పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలను మొదలుపెట్టిందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో విపక్షాలను ఎదుర్కోవాలంటే కేసీఆర్ ఇమేజ్‌తో పాటు క్షేత్రస్థాయిలోనూ బలమైన నేతలు అవసరమనే భావనలో టీఆర్ఎస్ నాయకత్వం ఉన్నట్టు సమాచారం. అందుకే కాంగ్రెస్‌లోని కొందరు ముఖ్యనేతలు టీఆర్ఎస్ నాయకత్వం టచ్‌లో ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    ఇదిలా ఉంటే ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఒకవేళ టీఆర్ఎస్, బీజేపీ ఈ రకమైన వ్యూహంతో వలసలు ప్రొత్సాహించేందుకు కాంగ్రెస్‌ను ఎటాక్ చేస్తే.. అది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పెద్ద సవాల్‌గా మారే అవకాశం ఉంటుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలోని పలువురు నేతలు ఇతర పార్టీలకు కోవర్టులుగా పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఆరోపిస్తోంది.

    అలాంటి నేతలు రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారని.. వారి వల్ల పార్టీకి నష్టం కలుగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఆయనతో సన్నిహితంగా ఉండే నేతలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఆయన పలు సీట్లపై కొంతకాలంగా ముందు నుంచే ఫోకస్ పెట్టారు

    Nara Lokesh: నారా లోకేశ్ కోసం ఆ టీడీపీ నేత వేరే జిల్లాకు వెళ్లిపోతున్నారా ?

    Telangana: కేసీఆర్‌ను టార్గెట్ చేసే విషయంలో రేవంత్ రెడ్డి ప్లాన్ సక్సెస్ అవుతుందా ?

    కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ఎంపిక చేయాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారని.. ఇదే విషయాన్ని ఆయన పార్టీ హైకమాండ్‌కు కూడా వివరించారని తెలుస్తోంది. కేసీఆర్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళితే ఇబ్బందులు రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ ముఖ్యనేతలపై టీఆర్ఎస్, బీజేపీ ఫోకస్ చేస్తే.. అందుకు కౌంటర్‌గా రేవంత్ రెడ్డి ఏం చేస్తారన్నది ఆసక్తి కలిగించే అంశమే.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Revanth reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు