సీఎం జగన్ స్విచ్ మోదీ చేతిలో ఉందా ? ఏపీలో ఏం జరుగుతోంది?

అసలు జగన్‌కు అంత అవసరం ఏముంది?. ఇంత పెద్ద మెజారిటీ పెట్టుకొని ఏపీలో పాలనకు సంబంధించి మోడీ, అమిత్ షాకు చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది?

news18-telugu
Updated: August 23, 2019, 12:48 PM IST
సీఎం జగన్ స్విచ్ మోదీ చేతిలో ఉందా ? ఏపీలో ఏం జరుగుతోంది?
జగన్, మోదీ
  • Share this:
ఏపీ ఎన్నికల్లో ఎవరు ఊహించని మెజార్టీతో గెలుపొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు... ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. మొత్తం 151 సీట్లతో సొంత పార్టీలోనూ ఎవరూ నోరు తెరిచి ప్రశ్నించే సాహసం చేయలేనంత మెజార్టీని  ప్రజలు కట్టబెట్టిన అందుకు అనుగుణంగా జగన్ వ్యవహారించడం లేదనే వాదనలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందిన పార్టీ నేతల్లో అసహనం చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఏపీ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయం తీసుకువాలన్ని జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాను సంప్రదించే చేస్తోన్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ప్రతిపక్షపార్టీలు.

సీఎం జగన్, ప్రధాని మోదీ


జగన్ తాను చేసే నిర్ణయాలు అన్నింటిని ముందే ప్రధాని మోడీ,కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు వివరిస్తున్నారా?. వాళ్లకు చెప్పే అన్నీ చేస్తున్నారా?. అవును అని సాక్ష్యాత్తూ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మీడియా సాక్షిగా వెల్లడించారు. అసలు జగన్ కు అంత  అవసరం ఏముంది?. ఇంత పెద్ద మెజారిటీ పెట్టుకుని ఏపీలో పాలనకు సంబంధించి మోడీ, అమిత్ షాల కు చెప్పి చేయాల్సిన అవసరం ఏముంది? విద్యుత్ పీపీఏల సమీక్షపై కేంద్ర కార్యదర్శి, కేంద్ర మంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాస్తే రాష్ట్రానికి ఆ అధికారం ఉందని..కేంద్ర అభ్యంతరాలకు సమాధానం చెబుతామని సాక్ష్యాత్తూ జగన్ ముఖ్య సలహాదారు అజయ్ కల్లాం మీడియాతో వ్యాఖ్యానించడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. మరో వైపు ఈ పరిణామాలు పార్టీ నేతలను కూడా ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు వ్యవహారాలను పర్యవేక్షించే పోలవరం ప్రాజెక్టు అథారిటీ రివర్స్ టెండరింగ్ వద్దని..దీని వల్ల వ్యయం పెరగటంతోపాటు పనుల్లో జాప్యం జరుగుతందని లేఖ రాస్తే దాన్ని బేఖాతర్ చేసి సర్కారు రివర్స్ టెండరింగ్ కు వెళ్ళింది.

Ycp irks bjp, Ysrcp mp vijayasai reddy, pm modi, amit shah, ap cm ys jagan, Amaravati capital shift, ap new capital donakonda, tdp, ysrcp, ap news, ap politics, బీజేపీని ఇరికించిన వైసీపీ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రధాని మోదీ, అమిత్ షా, ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ, వైసీపీ
అమిత్ షా, జగన్
పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వటంలో తప్పు లేదు. కానీ అక్రమాలు జరిగాయని.. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని పీపీఏలను రద్దు చేస్తున్నామని, తమకు ఆ అధికారం ఉందని చెబుతుంటే విజయసాయిరెడ్డి అన్నీ మోడీ, అమిత్ షాకు చెప్పి చేస్తున్నామని అనటం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతొంది. ఏపీ ప్రజలు ఉహించని భారీ మోజార్టీ ఇచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ప్రజా తీర్పును అపహస్యం చేస్తున్నట్లు వ్యవహారిస్తుందని టీడీపీ నేతలు ఆగ్రహాం వ్యక్తంచేస్తున్నారు. ప్రజలు అవకాశం ఇస్తే వారికి మంచి చేయాల్సింది పోయి గత ప్రభుత్వంలో ఉన్న వారిపై కక్ష సాధింపులకు జగన్ ప్రభుత్వం పాల్పడుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు సొంత పార్టీకి చెందిన పలు కీలక నేతలు మీడియా ముఖంగా చేస్తున్న వ్యాఖ్యలపై కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

జగన్ మోహన్ రెడ్డి, పోలవరం ప్రాజెక్టులో పనులు (ప్రతీకాత్మక చిత్రం)


అన్ని చెప్పి చేయటానికి మోడీ, అమిత్ షా ఏమైనా వైసీసీ అధిష్టానమా? అని లోలోపల పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే బొత్స చేసిన రాజధానిపై వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెడితే ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపుతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు గడుస్తున్న పాలనపై జగన్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని తవ్వితీయడమే ప్రధాన ఎజెండా పెట్టుకొని జగన్ ముందుకెళ్తున్నారు. అయితే ఇది ప్రభుత్వానికి అంత మంచి పరిణామం కాదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బొత్స వ్యాఖ్యలు తరువాత రాజధాని అంశంలో అంత దుమారం చెలరేగుతున్నా.. పార్టీకి చెందిన ఇతర నేతలెవ్వరు ఆ అంశంపై వివరణ ఇవ్వకపోవడం....అది తమకు సంబంధించి అంశం కాదన్నట్లుగా వ్యవహారించడం కూడా ప్రతిపక్షానికి ఒక అవకాశం ఇవ్వడమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>