ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో తమ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరింపజేయాలని ఆమ్ ఆద్మీ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఆపార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం దూకుడు పెంచారు. ఎన్నికల నోటిిఫికేషన్ వెలువడిన నాటి నుంచి బీజేపీ, కాంగ్రెస్ పట్టుకోల్పోయిన రాష్ట్రాల్లో తమ పార్టీని బలోపేతం చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని చూస్తున్నారు. పనిలో పనిగా పంజాబ్‌లో పాగా వేసేందుకు ఈ ఎన్నికల పోటీలో చీపురు గుర్తు పార్టీ అక్కడ తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్ధి పేరు(Aap punjab cm candidate)ను కూడా ప్రకటించారు సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind kejriwal). పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల(Punjab assembly election)ఫైట్‌కి సిద్ధమైన ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్దిగా భగవంత్‌మాన్(Bhagwant mann)ను ఎంపిక చేసినట్లు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ముఖ్యమంత్రిగా మీకు ఇష్టమైన అభ్యర్ధి పేరును సూచించమంటూ కేజ్రీవాల్ జనతా చునేగీ అప్నా సీఎం అనే డ్రైవ్‌ని నిర్వహించారు. దీనిపై పంజాబ్ ప్రజలు బాగా స్పందించారు. సుమారు 21లక్షల మంది తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. అందులో 93.3శాతం మంది భవవంత్ మాన్‌ను ఎంచుకోవడంతో ఆయన్నే తమ పార్టీ సీఎం అభ్యర్దిగా ప్రకటించారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. తనను సీఎం అభ్యర్దిగా ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షుడుకి ధన్యవాదాలు తెలిపారు భగవంత్‌మాన్. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను..ఇలాంటి అవకాశం వస్తుందనే ఆలోచన కూడా తనకు రాలేదన్నారు భగవంత్‌మాన్.
ప్రజలు ఎంపిక చేసిన వ్యక్తే సీఎం అభ్యర్ది..
48సంవత్సరాల భగవంత్‌మాన్ గతంలో సంగ్రూర్ నుంచి ఎంపీగా గెలిచారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్‌లో చేరిన తర్వాత జరిగిన 2012 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత 2017శాసనసభ ఎన్నికల్లో జలాలాబాద్ నుంచి పోటీ చేసి అక్కడ ఎస్‌ఏడీ అభ్యర్ధి సఖ్‌బీర్‌సింగ్ బాదల్ చేతిలో పరాజయం పాలయ్యారు మాన్. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి గెలిచారు భగవంత్‌మాన్.
కొత్త స్ట్రాటజీ ఫాలో అవుతున్న కేజ్రీవల్..
ప్రముఖ హాస్యనటుడిగా ఎంతో గుర్తింపు కలిగిన భగవంత్‌మాన్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని ఆప్ డిక్లేర్ చేయలేదు. 2017అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే పంజాబ్‌లో 20 స్థానాలు గెలిచి రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రస్తుతం పంజాబ్‌లో నెలకొన్ని కాంగ్రెస్‌లోని చీలకలు ఆమ్ ఆద్మీ పార్టీకి బాగా కలిసివచ్చేలా కనిపిస్తోంది. అమరీందర్‌సింగ్ కాంగ్రెస్‌ను వీడటం, చరణ్‌జిత్ సింగ్, సిద్దూల మధ్య కోల్డ్‌వార్ ఆప్‌కి ప్లస్ అయ్యే అవకాశం కనిపిస్తోందని పంజాబ్ ఓటర్లే చెబుతున్నారు. ఈసారి పోరులో చీపురు దెబ్బకు ఎంత మంది ఎగిరిపోతారా..లేక ఆప్ పార్టీకి ఎదురుదెబ్బ తగులుతుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5 State Elections, AAP, Punjab news